కృష్ణం రాజు నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, తొలి సినిమాతోనే శబాష్ అనిపించుకున్నాడు. ఆ రెండవ చిత్రం పెద్దగా ఆడకపోయినా, మూడవ చిత్రం ఇండస్ట్రీ ని షేక్ చేసే రేంజ్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. అలా మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ‘ఛత్రపతి’ సినిమా ద్వారా స్టార్ స్టేటస్ ని సంపాదించి, ఆ తర్వాత బాహుబలి సిరీస్ ద్వారా పాన్ వరల్డ్ మార్కెట్ లో అడుగుపెట్టి, ఇండియాలోనే నెంబర్ 1 హీరో గా కొనసాగుతున్నాడు ప్రభాస్.
ఇప్పుడు ఆయన ఎంత పెద్ద హీరో అయినా, అతనికి సినిమాల్లో ఎంట్రీ దక్కింది ఎవరి వల్ల అంటే కృష్ణం రాజు వల్లే అని చెప్పొచ్చు. తన ఉప్పలపాటి కుటుంబం నుండి ఇండియా కి ఒక సూపర్ స్టార్ ని బహుమతి గా ఇచ్చాడు ఆయన. చాలా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో మనం చూసే ఉంటాము, ప్రభాస్ గురించి మాట్లాడుతున్నప్పుడు కృష్ణం రాజు లో ఎంతో గర్వం కనిపిస్తూ ఉంటుంది. వీళ్లిద్దరు కలిసి ఇప్పటి వరకు ‘బిల్లా’, ‘రెబెల్’ మరియు రాధే శ్యామ్ వంటి సినిమాల్లో నటించారు.
వీటిల్లో ‘బిల్లా’ చిత్రానికి కృష్ణం రాజు నిర్మాతగా కూడా పని చేసాడు. బ్రతికి ఉన్న రోజుల్లో ఈ సినిమా షూటింగ్ జరగుతున్న సమయం లో తనకి ఎదురైనా మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను ఏ సినిమా అయినా ప్రొడక్షన్ లోకి వెళ్ళాను అంటే, అన్నీ కచ్చితంగా పర్ఫెక్ట్ గా సెట్ అయితేనే వెళ్తాను, లేదంటే లేదు. బిల్లా సినిమాకి ఆరోజుల్లో అన్నీ అలా కలిసొచ్చాయి.
అందుకే మాకు షూటింగ్ సమయం లో అదనంగా డబ్బులేమీ ఖర్చు అవ్వలేదు. కాకపోతే ఒకరోజు షూటింగ్ అయిపోయిన తర్వాత పక్క రోజే న్యూ ఇయర్ అని తెలిసింది. ప్రభాస్ పబ్ కి వెళ్లి ఎంజాయ్ చెయ్యాలన్యుకుంటే ఒక పబ్ మొత్తాన్ని బుక్ చేశాను, అదొక్కటే మాకు అదనంగా అయినా ఖర్చు ఆ సినిమాకి ‘ అంటూ చెప్పుకొచ్చాడు.