సినిమా వాళ్ళ విడాకుల వ్యవహారాలు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. అయితే 2024 లోనే చాలా మంది సినీ సెలబ్రిటీలు (Celebrity Couples) విడాకులు తీసుకుని సెపరేట్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
18 ఏళ్ళ పాటు కలిసి కాపురం చేసి ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత వీళ్ళు విడాకులు తీసుకుని సెపరేట్ అవ్వడం జరిగింది. 2022 లో వీళ్ళు విడాకులకు అప్లై చేసుకున్నారు. అయితే కోర్టు 2024 లో విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తుంది.
2) జీవీ ప్రకాష్ – సైంధవి :
ఏ.ఆర్.రెహమాన్ మేనల్లుడు, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి జీవీ ప్రకాష్ (GV Prakash) తన భార్య సైంధవికి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. 2013 ఈ జంట (Celebrity Couples)పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది. అయినప్పటికీ మనస్పర్థలు రావడంతో విడిపోతున్నట్లు స్పష్టమవుతుంది.
3) ఏ.ఆర్.రెహమాన్ – సైరా భాను :
జీవీ ప్రకాష్ మేనమామ, ఆస్కార్ అవార్డు గ్రహీత, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ఏ.ఆర్.రెహమాన్ కూడా తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకోవడం జరుగుతుంది. సైరా భాను లాయర్ ఈ విషయాన్ని తెలుపుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 1995 లో పెళ్లి చేసుకున్న ఈ జంట (Celebrity Couples) 29 ఏళ్ళ తర్వాత 2024 విడాకులు తీసుకోవడం గమనార్హం.
4) జయం రవి – ఆర్తి :
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi) సైతం తన భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ జయం రవి అలా ప్రకటించడం గమనార్హం. మరోపక్క తన భర్త విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించడం అనేది అతని భార్య ఆర్తికి కూడా తెలీదు అంటూ కామెంట్స్ చేయడం గమనార్హం.
5) ఇషా డియోల్ – భరత్ తఖ్తానీ:
బాలీవుడ్ హీరోయిన్ ఇషా డియోల్ (Esha Deol) సైతం తన భర్త భరత్ తక్తానికి విడాకులు ప్రకటించింది. 12 ఏళ్ళు కలిసున్న ఈ జంట 2024 లో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు.వీరికి కూడా రాధ్య, మిరయా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
6) ఊర్మిళ మటోండ్కర్ – మోహ్సిన్ అక్తర్:
మరో బాలీవుడ్ జంట అయిన ఊర్మిళ (Urmila Matondkar) ,మోసిన్ అక్తర్ మీర్ కూడా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. 2016లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. 8 ఏళ్లు గడవకముందే 2024 లో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించడం గమనార్హం.
7) యువ రాజ్‌కుమార్ – శ్రీదేవి బైరప్ప:
కన్నడ ఇండస్ట్రీకి చెందిన(రాజ్‌కుమార్ మనవడు) హీరో యువ రాజ్‌కుమార్ తన భార్య శ్రీదేవికి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. 2019లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. 2024 జూన్‌లో ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. సప్తమి గౌడతో (Sapthami Gowda) ఎఫైర్ పెట్టుకోవడం వల్లే.. తన భర్త విడాకులు ఇచ్చి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడని శ్రీదేవి మీడియా ముఖంగా కామెంట్లు చేసింది. దీనికి ఘాటుగా స్పందించి లీగల్ గా ప్రొసీడైన సప్తమి గౌడ .. శ్రీదేవి పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేయడం జరిగింది.
8) అరుణ్ జగదీష్- భామ :
మలయాళ జంట అయినటువంటి భామ అలియాస్ రేఖిత ఆర్.కురుప్ తన భర్త అరుణ్ జగదీష్ కు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించింది. 2020లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట…ఓ పాపకు జన్మనివ్వడం కూడా జరిగింది. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ జంట 2024 లో విడాకులకు అప్లై చేయడం సంచలనంగా మారింది.
9) మలైకా అరోరా – అరుణ్ కపూర్ :
బాలీవుడ్ లవ్ బర్డ్స్ అయినటువంటి మలైకా (Malaika Arora) , అర్జున్ కపూర్ (Arjun Kapoor) 2018 నుండి డేటింగ్ చేస్తూ వచ్చారు.ఓ దశలో పెళ్లి చేసుకుంటారు అనే ప్రచారం కూడా జరిగింది. కానీ వీళ్ళ మధ్య గ్యాప్ రావడంతో విడిపోయారు.
10) చందన్ శెట్టి – నివేదిత :
కన్నడ సినీ పరిశ్రమకు చెందిన (‘బిగ్ బాస్’ ఫేమ్) చందన్ శెట్టి, నివేదిత గౌడ కూడా 2024 లో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
అలాగే కోవిడ్ తర్వాత వివాహం చేసుకున్న ఓ టాలీవుడ్ నటుడు సైతం తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. అతని భార్య.. తన తల్లిని లెక్కచేయడం లేదని, అందుకే రోజూ గొడవలు జరుగుతున్నాయని.. ఆ నటుడు తన స్నేహితుల వద్ద చెప్పుకుని బాధపడుతున్నాడని సమాచారం.