బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే…వసుధార రిషి ఎంగేజ్మెంట్ ఫోటో పంపించి కాలేజీలో బ్యానర్ కట్టించమని శైలేంద్ర కాలేజ్ అటెండర్ కి చెబుతాడు ఆ మాటలు విన్న జగతి షాక్ అవుతుంది.శైలేంద్ర ఏం చేయబోతున్నారు అని ఆలోచనలో పడుతుంది మరోవైపు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుకు రిషి సార్ ఒప్పుకోకపోవడంతో పాండియన్ బ్యాచ్ ను పిలిచి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గొప్పతనం గురించి వివరిస్తుంది.
వాళ్లంతా తమ వెంట నడుస్తామని చెప్పారు అయితే మనం ఒకటే ఈ ప్రాజెక్టు తీసుకుంటే సరిపోదు మొన్న ఎలా గొడవ జరిగిందో తెలుసు కదా అందుకే రిషి సార్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమైతే బాగుంటుందని చెబుతుంది. అంతలోపు రిషి సార్ రావడంతో పాండ్యన్ ఒక పేపర్ రిషికి ఇస్తారు.అందులో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయండి సార్ అని రాసి ఉంటుంది ఇలా స్టూడెంట్స్ అందరూ ఇవ్వడంతో ఆ పేపర్స్ తీసుకొని రిషి లోపలికి వెళ్ళిపోతాడు.
మరోవైపు శైలేంద్ర స్నానం చేస్తూ ఉండగా ధరణి శైలేంద్ర ఫోన్ జగతికి ఇస్తుంది త్వరగా చూసి ఇవ్వండి అత్తయ్య మరి ఆయన వస్తారని చెబుతుంది అంతలోపు శైలేంద్ర వచ్చి మీరు ఎంత వెతికినా దొరకదు మీరు ఎవరికీ తెలియకుండా ఎలా ప్లాన్ చేస్తున్నారో నేను అంతకన్నా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నానని శైలేంద్ర మాట్లాడతారు. నీతో తర్వాత మాట్లాడుతానని ధరణిని అక్కడి నుంచి నెట్టేస్తాడు జగతి నువ్వేం చేస్తావు శైలేంద్ర కాలర్ పట్టుకుంటుంది.
మరోసారి రిషికి ఏ ప్రమాదం తలపెట్టావా అని నిలదీస్తూ ఉంటుంది. మీరు బాబాయ్ ఏం ప్లాన్ చేశారో నాకు తెలియదు అనుకున్నారా రిషి ఎక్కడున్నారో నాకు తెలుసు అని చెప్పడంతో మహేంద్ర తెలిస్తే ఏం చేస్తావురా అంటూ గుమ్మం నుంచి సీరియస్గా అడుగుతారు. దాంతో ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అవుతారు నాకు అన్ని తెలుసు ఏమి తెలియనట్టు నువ్వు నటించకు. నువ్వు ఏమి చేసినా మా అన్నయ్య కోసం మాత్రమే ఆగుతున్నాను అని మహేంద్ర చెబుతాడు.
మీ వీక్నెస్ అయిన నా వీక్నెస్ ఐన డాడీ మాత్రమే ఈ ఆటలో నేనే గెలుస్తాను ఎలాగైనా కాలేజ్ ఎండిగా నేనే ఉంటానని శైలేంద్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు మహేంద్ర వసుధారకు ఫోన్ చేసి శైలేంద్రకు మీరు ఎక్కడున్నారో తెలిసిపోయింది. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు. ఇక రిషి ప్రిన్సిపాల్ తో మాట్లాడుతూ తాను మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నానని డిబిఎస్టి కాలేజ్ వారికి చెప్పండి అలాగే పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ తో కలిపి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు చేపడతాము.
ఈ రెండింటికి కలిపి ఒక పెద్ద బ్యానర్ వేయిద్దామని చెప్పగా సంతోషించిన ప్రిన్సిపల్ బ్యానర్ వేసే వారిని ఇక్కడికే పిలిపిస్తానని చెప్పగా తను తెస్తే రెండు మూడు డిజైన్స్ మాత్రమే తెస్తారు. నేనే వెళ్లి సెలెక్ట్ చేస్తానని రిషి చెబుతాడు మరోవైపు వసుధార మీతో అర్జెంట్గా మాట్లాడాలి నేను కారిడార్ దగ్గర ఎదురుచూస్తున్నాను రమ్మని మెసేజ్ చేస్తుంది.ఇక లోపలికి వెళ్లిన రిషి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని బయట పాండియన్ బ్యాచ్ మొత్తం ఎదురు చూస్తుంటుంది. అయితే రిషి నవ్వుతూ బయటకు రావడంతో అందరూ సంతోషిస్తారు.