ఈ మధ్య పెద్ద హీరోల సినిమాల్లో క్యాస్టింగ్ కూడా రిచ్ గా ఉండాలి. హీరో ఇమేజ్ కి తగ్గట్టు విలన్ ఉండాలి. స్టార్ హీరోయిన్ ఉండాలి. ఒకవేళ కీలక పాత్ర అయితే పక్క భాషల్లోని స్టార్ హీరోని కూడా తీసుకోవాలి. అప్పుడే ఆ సినిమాకు బాగా మార్కెట్ అవుతుంది. బిజినెస్ విషయంలో ఎటువంటి ఢోకా ఉండదు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమా అంటే పక్క భాషల్లోని స్టార్లు ఉంటేనే.. అక్కడ డిజిటల్, శాటిలైట్.. వంటి బిజినెస్లకి మంచి రేట్లు వస్తాయి.
Jr NTR, Prashanth Neel
రాజమౌళి (S. S. Rajamouli) చేసేది ఇదే. తర్వాత ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కూడా ఇదే మొదలుపెట్టాడు. ప్రభాస్ తో చేసిన ‘సలార్’ (Salaar) కోసం మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ను (Prithviraj Sukumaran) రంగంలోకి దింపాడు. ‘సలార్’ మలయాళంలో మంచి బిజినెస్ చేయడానికి, మంచి కలెక్షన్స్ సాధించడానికి అది బాగా హెల్ప్ అయ్యింది. అంతకు ముందు ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) సినిమాలో కూడా మోహన్ లాల్ ని తీసుకున్నారు. దానికి కూడా అక్కడ మంచి బిజినెస్ అయ్యింది.
ఇప్పుడు ఎన్టీఆర్ తో (Jr NTR) చేయబోతున్న పాన్ ఇండియా సినిమా కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ మరో మలయాళం స్టార్ ను రంగంలోకి దింపుతున్నాడు. అవును నిజమే.. ఎన్టీఆర్ సినిమా కోసం అక్కడి స్టార్ హీరో టోవినో థామస్ ను తీసుకోబోతున్నాడు. ఆల్రెడీ చర్చలు కూడా జరిగాయట. టోవినో థామస్ (Tovino Thomas) కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ చెప్పిన కథ, పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసినట్టు వినికిడి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని ఇన్సైడ్ టాక్.