మంచు వారి గొడవలు మొదట మీడియాలోకి, తర్వాత వీధుల్లోకి వచ్చాయి. తర్వాత జెనరేటర్లో పంచదార వేసి వార్తల్లో నిలిచాడు మంచు విష్ణు (Manchu Vishnu). ఇప్పుడు తమ సినిమాల్లో మోహన్ బాబు (Mohan Babu) చెప్పిన డైలాగులతో సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు పరోక్షంగా ధూషించుకుంటున్నారు. ముందుగా మంచు విష్ణు తన ‘రౌడీ’ సినిమాలోని “సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా.. కనీసం వచ్చే జన్మలో తెలుసుకుంటావన్న ఆశ” అనే డైలాగుని షేర్ చేసి ఇందులో పెద్ద స్టేట్మెంట్ ఉందని, ఇది తన ఫేవరెట్ డైలాగ్ అని రాసుకొచ్చి మోహన్ బాబు 50 ఏళ్ల సినీ జీవితాన్ని గుర్తుచేస్తూ ఓ హ్యాష్ ట్యాగ్ పెట్టాడు.
Manchu Vishnu vs Manchu Manoj
పరోక్షంగా ఇది విష్ణు తన మోహన్ బాబు ఇల్లు, విద్యానికేతన్ బయట చేసిన రచ్చని గుర్తు చేస్తూనే ఉంది అని అర్థం చేసుకోవచ్చు. మరోపక్క.. మంచు మనోజ్ సైతం తన ‘శ్రీ’ సినిమాలోని మోహన్ బాబు చెప్పిన డైలాగుని షేర్ చేశాడు. ఇందులో “ఇంతకీ నీకు ఏం కావాలిరా..! బలవంతంగా తన్ని, కొట్టి, చంపుతానని బెదిరించి నేను తెచ్చి ఇచ్చిన 43 దస్తావేజులు నాకు కావాలి. బసవా కాలు దువ్వాలనుకుంటున్నావా?
ఏయ్..! కాలు దువ్వాలనుకుంటే అడుగు పెట్టగానే తల నరికి నీ పెళ్ళాం ఒడిలో వేసేవాడిని. నా ఆలి చెప్పింది కాబట్టి, గొడవలు మాని చేసిన పాపం కడిగేస్కుందాం అని వచ్చా” అంటూ డైలాగులు ఉన్నాయి. ఇది విష్ణు పై సెటైర్ అని క్లూ ఇచ్చి మరీ చెప్పాడు మంచు మనోజ్. ‘VisMith'(V అంటే విష్ణు M అంటే మనోజ్ (Manchu Manoj) అని అర్థం వచ్చేలా హైలెట్ చేశాడు). అలాగే ‘హిజ్ హాలీవుడ్ వెంచర్’ అంటూ సెటైరికల్ గా ‘కన్నప్ప’ గురించి ఓ కామెంట్ పెట్టాడు మనోజ్.