సినిమా విజయం సాధిస్తే మొత్తం పరిశ్రమ పండగ చేసుకుంటుంది అని అంటుంటారు. నిజానికి అలాంటి పండగలు జరుగుతాయో లేదో తెలియదు కానీ.. ఆ హీరోల ఫ్యాన్స్ అయితే కచ్చితంగా పండగ చేసుకుంటారు. అలా వచ్చే మేడే నాడు దేశంలో మూడు కీలకమైన సినిమా పరిశ్రమల్లో పండగలు చేసుకోవడానికి హీరోల ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. ఒక భాష పరిశ్రమలో అయితే మొత్తంగా సినిమా ఫ్యాన్సే భారీ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకో చోట సరైన విజయం హీరోకు రావాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
మన దగ్గర అయితే సమ్మర్ సప్పగా సాగకుండా ఉండాలంటే ఆ సినిమా విజయం సాధించాలి అని కోరుకుంటున్నారు. ముందుగా మన పరిశ్రమ నుండే మొదలుపెడదాం. మే 1వ తేదీన తెలుగులో ‘హిట్ 3’ (HIT3) సినిమా రాబోతోంది. నాని (Nani) – శైలేష్ కొలను(Sailesh Kolanu) – శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేస్తున్నారు. సినిమా (HIT3) ప్రమోషన్స్ స్టఫ్, జోనర్ చూస్తుంటే నమ్మకం అయితే ఉంది.
‘దసరా’(Dasara) , ‘సరిపోదా శనివారం’తో(Saripodhaa Sanivaaram) మాస్ హీరోగా నాని రాణించాడు. కాబట్టి ఈ సారీ విజయం సాధించి సమ్మర్ హీరో అవ్వాలనేది ఫ్యాన్స్ కోరిక. ఇక పక్కనే ఉన్న తమిళ పరిశ్రమ గురించి చూద్దాం. ‘కంగువా’ (Kanguva) అంటూ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఊహించని అతి భారీ పరాజయం అందుకున్నాడు సూర్య (Suriya) . దీంతో అతనికి ఓ భారీ విజయం అవసరం అని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఈ క్రమంలో మాస్ సినిమాల్లో వైవిధ్యం చూపించే కార్తిక్ సుబ్బరాజుతో (Karthik Subbaraj) ‘రెట్రో’ (Retro) అనే సినిమా చేశాడు సూర్య.
తెలుగులో కూడా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ఈ సినిమా విజయం సూర్యకు చాలా అవసరం. లేదంటే రెండు వరస పరాజయాలు ఇబ్బందిపెడతాయి. ఇక మిగిలింది బాలీవుడ్. అక్కడ అజయ్ దేవగణ్ (Ajay Devgn) ‘రైడ్ 2’ సినిమాతో రాబోతున్నాడు. ‘రైడ్’ సినిమా విజయంతో ఈ సీక్వెల్ చేశారు. ఇప్పుడు చేసిన ప్రతి బాలీవుడ్ సినిమా విజయం సాధించే పరిస్థితుల్లో లేదు. మరోవైపు బాలీవుడ్ సరైన విజయానికి ముఖం వాసిపోయి ఉంది. కాబట్టి మేడే అందరికీ ఇంట్రెస్టింగ్ డేనే. చూద్దాం ఎవరిని విజయం వరిస్తుందో? లేక అందరూ ముచ్చటపడతారో.