మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaisshnav Tej) .. పరిచయం అవసరం లేని పేరు. డెబ్యూ మూవీ ‘ఉప్పెన’ (Uppena) తోనే పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. డెబ్యూ హీరోల సినిమాల్లో ‘ఉప్పెన’ అత్యధిక కలెక్షన్స్ ని రాబట్టి చరిత్ర సృష్టించింది. నేషనల్ అవార్డు అందుకున్న సినిమా ఇది. వైష్ణవ్ కూడా బాగా నటించాడు. మొదటి సినిమాలోనే 10 సినిమాల అనుభవం ఉన్న నటుడిగా యాక్ట్ చేసి మెప్పించాడు. కాకపోతే ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ ఎక్కువ శాతం హీరోయిన్ కృతి శెట్టి Panja (Krithi Shetty), దర్శకుడు బుచ్చిబాబు సానాకి (Buchi Babu Sana) వెళ్ళిపోయింది.
అయినప్పటికీ వైష్ణవ్ కి మంచి ఆఫర్లు వచ్చాయి. వెంటనే క్రిష్ దర్శకత్వంలో ‘కొండపొలం’ (Konda Polam) అనే సినిమా చేశాడు. అది ఆడలేదు. తర్వాత ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వంటి పెద్ద బ్యానర్లో సినిమాలు చేశాడు. అలా చేసిన ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga) ‘ఆది కేశవ’ (Aadikeshava) సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. 2023 చివర్లో ‘ఆదికేశవ’ రిలీజ్ అయ్యింది.
దాని తర్వాత వైష్ణవ్ నుండి మరో సినిమా రాలేదు.కనీసం వైష్ణవ్ తన నెక్స్ట్ సినిమాని ఇంకా మొదలు పెట్టింది కూడా లేదు. అయితే వైష్ణవ్ కి చాలా మంది నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చారట. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ వారు కూడా వైష్ణవ్ కి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. మరిన్ని అగ్ర నిర్మాణ సంస్థలు వైష్ణవ్ తో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాయి. కానీ వైష్ణవ్ అండ్ టీం మాత్రం స్క్రిప్టులు రిజెక్ట్ చేస్తూ వస్తున్నారట.
ఈ 2 ఏళ్లలో ఈ మెగా హీరో దాదాపు 100 స్క్రిప్టులు రిజెక్ట్ చేశాడట. ఇది నిర్మాణ సంస్థలకి షాకిచ్చినట్టు తెలుస్తుంది. సాధారణంగా వైష్ణవ్ లేదా సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej).. వంటి వారి స్క్రిప్టుల ఎంపికలో వేరే వాళ్ళ జోస్యం ఉండదు. మరి లోపం ఎక్కడ ఉందో అతన్ని అప్రోచ్ అయిన దర్శకులకి అర్థం కావడం లేదు. ఏదేమైనా ఈసారి మంచి హిట్టు కొట్టి కంబ్యాక్ ఇవ్వాలనేది వైష్ణవ్ ఆలోచన కావచ్చు.