‘ఛలో’ (Chalo) , ‘భీష్మ’ (Bheeshma) అంటూ రెండు హిట్ సినిమాలు తీసి.. మూడో సినిమా మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) చేసే అవకాశాన్ని తృటితో చేజార్చుకున్న వెంకీ కుడుముల (Venky Kudumula) ‘రాబిన్ హుడ్’(Robinhood) అంటూ నితిన్‌తో ఇప్పుడు మళ్లీ వస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి హీరో – దర్శకుడు ఎంత ప్రచారం చేస్తున్నారో.. కాంట్రవర్శీలు కూడా అంతే ప్రచారం చేస్తున్నారు. మొన్నటివరకు ‘అదిదా సర్‌ప్రైజు’ పంచాయితీ నడవగా.. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) కామెంట్ల కంగాళీ నడుస్తోంది. వీటిపై వెంకీ కుడుముల క్లారిటీ ఇచ్చారు.
‘అదిదా సర్‌ప్రైజు..’ పాట చేస్తున్నప్పుడు హుక్ స్టెప్‌పై ఇంత వ్యతిరేకత వస్తుందని ఊహించలేదు. అలా అనిపించి ఉంటే మేమే తీసేవాళ్లం. కేతిక శర్మను (Ketika Sharma) ఇటీవల కలిసినప్పుడు కూడా ఈ విషయం గురించే మాట్లాడుకున్నాం. ఆ స్టెప్‌పై చిత్రబృందమంతా కలిసి ఓ నిర్ణయం తీసుకుంటాం అని వెంకీ కుడుముల చెప్పారు. అయితే సినిమా విడుదలకు ఇంకా మూడు రోజులే ఉండగా ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం ఏంటో మరి.
ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్ గురించి రాజేంద్రప్రసాద్ ఏదేదో మాట్లాడారు. దాని గురించి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ విషయం వెంకీ కుడుముల దగ్గర ప్రస్తావిస్తే.. రాజేంద్రుడి మాటల వెనక ఉద్దేశం డేవిడ్ వార్నర్‌కి వివరించానని, ఆయన చాలా సరదాగా తీసుకున్నారని చెప్పారు. అంతేకాదు క్రికెట్‌లో స్లెడ్జింగ్ తనకు అలవాటే అని..
అలా ఇది నటుల మధ్య స్లెడ్జింగ్ అనుకుంటానని కూడా చెప్పారని వెంకీ తెలిపారు. ఇలా రెండు కాంట్రవర్శీల విషయంలో వెంకీ కుడుముల క్లారిటీ ఇచ్చేశారు. ఇంకా వీటి గురించి చర్చ జరిగితే మాత్రం ఎవరూ ఏమీ చేయలేరు. అయితే ‘అదిదా సర్‌ప్రైజు’ పాటలో ఆ హుక్ స్టెప్ తీసేశారని.. దాని ప్లేస్‌లో వేరే స్టెప్ పెట్టి పాటను ఎడిట్ చేశారు అని చిత్రవర్గాల సమాచారం.