మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి తాజాగా చిత్రపురి కాలనీలో లబ్ధిదారులు అయినటువంటి వారికి ఇంటి తాళాలను అందజేశారు.ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి చిత్ర పరిశ్రమ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. డబల్ బెడ్ రూమ్ గృహ లబ్ధిదారులందరికీ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ.. తనని సి కళ్యాణ్, భరద్వాజ్ లాంటివాళ్ళు ఇండస్ట్రీకి పెద్దవాడినని కామెంట్ చేస్తున్నారు.
అయితే తాము చిన్న అనిపించుకోవడం కోసం నన్ను పెద్ద చేస్తున్నారంటూ ఈయన చమత్కరించారు. ఇండస్ట్రీలో నేను పెద్దరికం అనుభవించాలని ఎప్పుడు కోరుకోలేదు. ఆ భగవంతుడు నేను కోరుకున్న దాని కన్నా నాకు ఎక్కువగా ఇచ్చారని తెలిపారు. ఇలా ఇండస్ట్రీ పెద్దగా తాను బాధ్యతలు ఎప్పుడూ తీసుకోనని కానీ సినీ కార్మికులకు మాత్రం అండగా తాను ఎప్పుడూ ముందు ఉంటానని తెలిపారు.సినీ కార్మికులకు ఏ కష్టం వచ్చినా తనకు చేతనైన సహాయం చేస్తూ వారికి అండగా నిలుస్తానని చిరంజీవి తెలిపారు.
సరిగ్గా 22 సంవత్సరాల క్రితం ఇదే రోజున చిత్రపురి కాలనీ శంకుస్థాపన జరిగిందని గుర్తు చేసుకున్నారు. చిత్రపురి కాలనీలో కార్మికుల సొంతింటి కల నెరవేరడం చాలా సంతోషంగా ఉందని ఈయన తెలిపారు. ప్రభాకర్ రెడ్డి వంటివారి దూరదృష్టి వల్లే కార్మికుల సొంతింటి కల సాకారం అయిందని అన్నారు.
చిత్రపురి కాలనీ ఇళ్ల నిర్మాణంలో గతంలో జరిగిన అక్రమాల గురించి తనకు పెద్దగా అవగాహన లేదు అందుకే ఆ విషయం గురించి తాను మాట్లాడదలచుకోలేదని ఈ సందర్భంగా చిరు చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.