తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. పుల్లింగ్ కెపాసిటీ ఉన్న అతికొద్ది మంది హీరోలలో బన్నీ కూడా ఒకరు. పుష్ప ది రైజ్ కు యావరేజ్ టాక్ వచ్చినా బన్నీకి ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఈ ఇమేజ్ ఉండగా ప్రస్తుతం ఈ జాబితాలో ప్రభాస్, బన్నీ కూడా చేరారు.
ప్రభాస్ నటించిన సాహో సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా ఆ సినిమాకు ఊహించని స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. పుష్పలో డీ గ్లామర్ లుక్ లో బన్నీ నటించగా సెకండ్ వీకెండ్ లో కూడా ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో రిలీజయ్యే వరకు ప్రేక్షకులకు పుష్ప ఫస్ట్ ఛాయిస్ గా నిలిచే ఛాన్స్ ఉంది. శ్యామ్ సింగరాయ్ కు హిట్ టాక్ వచ్చినా పుష్ప,
శ్యామ్ సింగరాయ్ సినిమాల జానర్ లు వేరు కావడంతో పుష్పకు వీక్ డేస్ లో కూడా బాగానే కలెక్షన్లు వస్తున్నాయి. మరోవైపు పుష్ప సక్సెస్ తో జోరుమీదున్న బన్నీ మెగా ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. నిహారిక కోసం బన్నీ శాంటాగా మారారు. నిహారికకు బన్నీ సర్ప్రైజ్ గిఫ్ట్ లు ఇచ్చారని సమాచారం. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్టై ఆ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నా మంచి బహుమతులు కొనడానికి బన్నీ సమయం వెచ్చించాడని నిహారిక తెలిపారు.
బన్నీకి థ్యాంక్స్ చెప్పడంతో పాటు వచ్చే ఏడాది మాత్రం ఇలా మోసం చేయకు అని నిహారిక అన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ రష్యాకు వెళ్లగా పవన్ పిల్లలు ఈ వేడుకలలో పాల్గొనలేదు. బన్నీకి మెగా ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగిందని వార్తలు రాగా క్రిస్మస్ ఫోటోలతో మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటేనని బన్నీ చెప్పకనే చెప్పేశారు. ఫిబ్రవరి నెల నుంచి పుష్ప2 షూటింగ్ లో బన్నీ పాల్గొననున్నారు. ఈ సినిమా తర్వాత బన్నీ నటించబోయే సినిమాలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. బన్నీ నటించాల్సిన ఐకాన్ మూవీ ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి.