కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృభిస్తుంది. ఈ భయంకరమైన వ్యాధి నివారణకు ప్రభుత్వం వివిధ రకాల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అలానే యావత్ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖులు సైతం తమ వంతుగా ఆర్ధిక సహకరాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా నివారణ చర్యలకు యంగ్ డైనమిక్ హీరో నిఖిల్ కూడా ముందుకొచ్చారు. కరోనాని అరికట్టేందుకు ముందు వరసలో ఉండి యుద్ధం చేస్తున్న డాక్టర్స్ కి, మెడికల్ సిబ్బందికి చేయుతగా వారి రక్షణకి పర్సనల్ ప్రొటక్షన్స్ కిట్స్ భారీగా అందించారు.
ఈ కిట్స్ అన్నిటిని గాంధీ ఆసుపత్రిలో ఉన్న హెల్త్ డిపార్టెంట్ అధికారులకి స్వయంగా నిఖిల్ తీసుకెళ్లి అందజేయడం విశేషం. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ కరోనా నివారణ మనందరికి ఎంత ముఖ్యమో, డాక్టర్లునీ సైతం ఆ కరోనా భారీన పడకుండా, వారికి శ్రమ కలగకుండా చూసుకోవడం కూడా అందే ముఖ్యం. డాక్టర్లతో పాటు మిగిలిన హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, పోలీస్ సిబ్బంది,
మున్సిపల్ కార్మికులు, అధికారులు మనందరి కోసం ఎలాంటి ప్రమాదాన్ని లెక్క చేయకుండా కష్టపడుతున్నారు. అందుకు నా వైపు కృతజ్ఞతగా ఈ పర్సనల్ ప్రొటక్షన్ కిట్స్ అందిస్తున్నాను. కరోనా నివారణ జరగాలంటే మనందరం ఇంటిలోనే ఉంటూ ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 21 రోజుల లాక్ డౌన్ కి మనందరం సహకరించాలి అని అన్నారు.