ప్రెజంట్ జనరేషన్ హీరోల్లో ఎవరూ ఊహించని విధంగా స్టార్ డమ్, క్రేజ్ సొంతం చేసుకున్న ఏకైక కథానాయకుడు విజయ్ దేవరకొండ. ఈ విషయాన్ని కాదనేవారు లేరు. మనోడి సినిమాలకంటే.. బయట యాటిట్యూడ్ కి ఫిదా అయ్యి అతడ్ని ఫాలో అయ్యే కుర్రాళ్ళు, అమ్మాయిలే ఎక్కువ. అలాంటి దేవరకొండ రీసెంట్ గా ఫోర్బ్స్ 30 లిస్ట్ లోకి చేరడం అనే విషయాన్ని విజయ్ కంటే ఎక్కువగా అతడి అభిమానులే గర్వంగా ఫీలయ్యారు. ఆ సందర్భంగా విజయ్ దేవరకొండ చిన్న పిట్ట కథ చెప్పాడు. అదేంటంటే.. సరిగ్గా అయిదేళ్ళ క్రితం అబ్బాయిగారి ఆంధ్రా బ్యాంక్ ఎకౌంట్ లో 500 కూడా లేవని మనోడి ఎకౌంట్ ను బ్లాక్ చేశారట. అలాంటిది నేడు ఏకంగా ఫోర్బ్స్ లిస్ట్ లో స్థానం సంపాదించుకోవడం చాలా ఆనందంగా ఉంది” అని తన హ్యాపీనెస్ ను షేర్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ.
అంతా బాగానే ఉంది కానీ.. విజయ్ నటుడిగా కెరీర్ మొదలెట్టింది 2011లో, పోనీ మొదటి రెండు మూడు సినిమాలైన “నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్” చిత్రాలకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదంటే నమ్మోచ్చు కానీ.. 2015లో విడుదలైన “ఎవడే సుబ్రమణ్యం” చిత్రానికి కూడా విజయ్ కి రెమ్యూనరేషన్ ఇవ్వలేదా లేక అతను ఫ్రీగా చేశాడా అని ఆలోచించడం మొదలెట్టారు జనాలు. అయితే.. విజయ్ వీరాభిమానులు మాత్రం.. హీరో చెప్పిన ఇన్స్పైరింగ్ స్టోరీ విని ఇన్స్పైర్ అవ్వడం మానేసి.. ఇలా తొక్కలో లాజిక్స్ వెతుకుతారేంటి అని సీరియస్ అయ్యారు.