విజయ్ దేవరకొండ చేసింది ఇప్పటికి పట్టుమని పది సినిమాలు లేవు.ఆయన చేసిన అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలు అతన్ని సూపర్ ఫేమస్ చేశాయి. దీనితో డియర్ కామ్రేడ్ చిత్రాన్ని సౌత్ ఇండియా లెవెల్ ల్లో అన్ని భాషలలో విడుదల చేశారు. ఆ సినిమా కంటెంట్ పరంగా పాజిటివ్ టాక్ వచ్చినా, కమర్షియల్ గా హిట్ కాలేదు. ఈ సినిమా ఫలితం తరువాత విజయ్ దేవరకొండ మీడియా ముఖంగా కొంచెం అసహనం వ్యక్తం చేశారు. కావాలని కొందరు నా చిత్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ కుండబద్దలు కొట్టారు.
కాగా ఆయన లేటెస్ట్ రిలీజ్ వరల్డ్ ఫేమస్ లవర్ కూడా భారీగానే విడుదల చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో విడుదలైంది. ఐతే అనూహ్యంగా ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కనీసం 50శాతం పెట్టుబడి కూడా రాబట్టే పరిస్థితి లేదు. ఇది ఒక విధంగా విజయ్ కి పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఈ చిత్ర ఫలితం తేలిపోయిన క్రమంలో విజయ్ ని దర్శకుడు పూరీనే కాపాడాలి. మరి పూరి జగన్నాధ్ మంచి కాన్సెప్ట్ తో ఆహ్లాదంగా తెరకెక్కించి హిట్ అందించాలి. లేదంటే అటు విజయ్ కెరీర్ కి ఇటు నిర్మాతగా పూరికి దెబ్బ తగులుతుంది. కాబట్టి పూరి ఈ చిత్రంతో హిట్ అందుకోవడం చాలా అవసరం.కెరీర్ బిగినింగ్ మినహా ఇస్తే పూరి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది లేదు. చూడాలి పూరి విజయ్ ని హిట్టు మెట్టు ఎక్కిస్తాడో లేదో.