కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar) నటించిన లేటెస్ట్ మూవీ ‘పట్టుదల’ (Pattudala). త్రిష (Trisha) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మగిల్ తిరుమేని (Magizh Thirumeni) దర్శకుడు. యాక్షన్ కింగ్ అర్జున్ ( Arjun Sarja), రెజీనా(Regina Cassandra)..లు కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ‘లైకా ప్రొడక్షన్స్’ సంస్థ పై సుభాస్కరన్ (Subaskaran Allirajah) ఈ చిత్రాన్ని రూ.250 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. దాదాపు రెండేళ్ల పాటు షూటింగ్ జరిపారు. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్ పెద్దగా బజ్ ను క్రియేట్ చేయలేదు.
అయినప్పటికీ తమిళంలో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగా నమోదయ్యాయి. తెలుగులో ఈ సినిమాకి భారీగా అయితే థియేట్రికల్ బిజినెస్ జరగలేదు. పైగా అన్ సీజన్ కావడంతో తెలుగులో దీనిపై బజ్ కూడా లేదు. ఒకసారి ఈ సినిమా తెలుగు థియేట్రికల్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను గమనిస్తే :
నైజాం | 1.20 cr |
సీడెడ్ | 0.80 cr |
ఉత్తరాంధ్ర | 1.20 cr |
ఈస్ట్ | 3.20 cr |
‘పట్టుదల'(తెలుగు) కి రూ.3.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అజిత్ గత చిత్రం ‘తెగింపు’ ఫుల్ రన్లో రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టింది. అది కూడా సంక్రాంతి సీజన్లో. సో ఇప్పుడు టార్గెట్ కష్టమనే చెప్పాలి. పోటీగా ‘తండేల్’ కూడా ఉంది కాబట్టి.. స్ట్రాంగ్ పాజిటివ్ టాక్ వస్తే తప్ప బ్రేక్ ఈవెన్ అవ్వడం సులభం ఏమీ కాదు అనే చెప్పాలి.