Pawan Kalyan: విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై పవన్ కళ్యాణ్ ట్వీట్!
- October 28, 2024 / 03:36 PM ISTByFilmy Focus
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం తాను కమిట్ అయిన సినిమాలను త్వరగా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. టీవీకే(TVK – తమిళ వెట్రి కజగం) అనే సొంత పార్టీని స్థాపించాడు విజయ్. ఇటీవల ఓ ప్రెస్ మీట్ కూడా నిర్వహించాడు. ఈ క్రమంలో సినీ పరిశ్రమ నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టి సంచలనాలు సృష్టించిన ఎం.జి.ఆర్, ఎన్టీఆర్ వంటి మహామహులను గుర్తుచేసుకున్నాడు. వారి ప్రయాణం ఎంత గొప్పదో వివరించాడు.
Pawan Kalyan

అలాగే తన రాజకీయ భవిష్యత్తుకి తన అభిమానులు సపోర్ట్ చేసినా చాలు అన్నట్టు కూడా చెప్పుకొచ్చాడు విజయ్. అంటే తన 69 సినిమాలకు పని చేసి తనని దగ్గరుండి చూసినవాళ్లు, తన సినిమాలు చూసి ఇష్టపడిన వారు ఓటేసినా చాలు అని చెప్పుకొచ్చాడు. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’ అనే అర్ధం వచ్చేలా విజయ్ అలా చెప్పాడు అనుకోవచ్చు. పనిలోపనిగా కొంతమంది పొలిటీషియన్స్ పై సెటైర్లు కూడా విసిరాడు విజయ్.
ఇదిలా ఉండగా.. విజయ్ పొలిటికల్ కెరీర్..కు తన బెస్ట్ విషెస్ ను తెలియజేశాడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). తన ట్విట్టర్ వేదికగా విజయ్ కి కంగ్రాట్స్ చెబుతూ.. విజయ్ ని యోధులతో పోలుస్తూ ట్వీట్ వేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. సినిమాల పరంగా చూస్తే టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ కి ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో… కోలీవుడ్లో విజయ్ కి కూడా అదే రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి పవన్ కళ్యాణ్ మాదిరి విజయ్ రాజకీయాల్లో సక్సెస్ అవుతాడేమో చూడాలి.
My Heartfelt Congratulations!! to Thiru @actorvijay avl, for embarking on a political journey in Tamilnadu, the land of Saints & Siddhars.
— Pawan Kalyan (@PawanKalyan) October 28, 2024

















