పూజా హెగ్డే (Pooja Hegde).. ‘ఒక లైలా కోసం’ (Oka Laila Kosam) చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.ఆ వెంటనే ‘ముకుంద’ (Mukunda) అనే సినిమాతో కూడా ప్రేక్షకులను పలకరించింది. ఆ రెండు సినిమాలతో ఈమె రేంజ్ అమాంతం పెరిగిపోయింది. తర్వాత బాలీవుడ్లో ఛాన్స్ లభించింది. అక్కడ ఈమెకు గ్రాండ్ వెల్కమ్ దక్కింది కానీ.. సక్సెస్ వెంటనే దొరకలేదు. ఆమె కెరీర్ డల్ గా ఉన్న టైంలో హరీష్ శంకర్ (Harish Shankar) ‘డీజే’ (Duvvada Jagannadham) ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమాతో పూజా రేంజ్ అమాంతం పెరిగిపోయింది.
అన్నీ ఎలా ఉన్నా ఒకప్పుడు పూజా హెగ్డే రూ.3 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేసేది. కానీ ఇప్పుడు ఆమె రేంజ్ బాగా తగ్గిపోయింది. రూ.70 లక్షలకి మించి ఆమెకు చెల్లించలేమని దర్శక నిర్మాతలు చెబుతున్నారట. ప్రస్తుతం పూజ చేతిలో ఓ తమిళ సినిమా, ఓ బాలీవుడ్ సినిమా ఉంది. ఆ తర్వాత ఏంటి అంటే..? ప్రస్తుతం ఈమెకు ఆఫర్లు రావడం లేదు. ఈ క్రమంలో లారెన్స్ తెరకెక్కిస్తున్న ‘కాంచన 4’ లో ఈమెకు హీరోయిన్ ఛాన్స్ లభించిందట.
అయితే ఈ ప్రాజెక్టు కోసం పూజా రూ.1 కోటి పారితోషికం డిమాండ్ చేసిందట. అందుకు దర్శక నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్టు వినికిడి. ‘ముని’ సీక్వెల్స్ కి మంచి క్రేజ్ ఉంది. ఇది కనుక హిట్ అయితే ఆమె ఇంకో 2 సినిమాలకి కోటి వరకు మరి ఈ సినిమా పూజా హెగ్డే కు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.