టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ (Prabhas) ఈ ఏరియా ఆ ఏరియా అనే తేడాల్లేకుండా అన్ని ఏరియాలలో సంచలన రికార్డులను సొంతం చేసుకుంటూ సత్తా చాటుతున్నారు. తక్కువ జనాభా ఉన్న జిల్లాలలో సైతం ప్రభాస్ సినిమాలు కలెక్షన్ల పరంగా అదరగొడుతున్నాయి. సీడెడ్ లో కల్కి సినిమా సాధించిన సంచలనాలు చూసి షాకవ్వడం ఫ్యాన్స్ వంతవుతోంది. సీడెడ్ లో కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమా 20 కోట్ల రూపాయల మార్క్ ను దాటింది.
ప్రభాస్ నటించిన బాహుబలి (Baahubali ), బాహుబలి2 (Baahubali 2), సలార్ (Salaar) , కల్కి 2898 ఏడీ సినిమాలు సీడెడ్ లో 20 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించాయి. సీడెడ్ లో మాస్ సినిమాలు మాత్రమే భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తాయని అందరూ భావిస్తారు. సీడెడ్ లో ఏకంగా 4 సినిమాలతో 20 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించడం ప్రభాస్ కు మాత్రమే సాధ్యమైందని చెప్పవచ్చు.
ప్రభాస్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్ లో ఒక సినిమాలో, సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ సినిమాలన్నీ అత్యంత భారీ స్థాయిలో, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం కొసమెరుపు. ప్రభాస్ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటూ ఉండటం ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందనే చెప్పాలి.
ప్రభాస్ నార్త్ బెల్ట్ లో సైతం అంచనాలకు మించి మార్కెట్ ను పెంచుకుంటూ ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నారనే చెప్పాలి. ప్రభాస్ సినిమాలు పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే మార్కెటింగ్ పరంగా మ్యాజిక్ చేస్తుండటం గమనార్హం. ప్రభాస్ తో సినిమా తెరకెక్కిస్తే కనీసం 100 కోట్ల రూపాయల లాభం రావడం గ్యారంటీ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.