సినిమాల గురించి మాట్లాడేటప్పుడు ఓ మాట మనం తరచూ వింటూ ఉంటాం. ఎంతో కష్టపడి సినిమా తీస్తారు.. ఒక్కసారి చూసి ‘ప్చ్ ఏం బాలేదు’ అని ఎలా అనేస్తారు అని. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న సినిమా ‘ఆదిపురుష్’. మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనే పేరు నుండి.. ఇప్పుడిప్పుడే రాకపోయినా ఫర్వాలేదు అనే పరిస్థితికి వచ్చేసింది ఈ సినిమా. దీనికి కారణం టీజర్‌లో ప్రభాస్ కనిపించిన విధానం, విజువల్ ఎఫెక్ట్స్ అని చెప్పాలి.
ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ చేసిన కొన్ని కామెంట్స్‌కు సోషల్ మీడియా రెండుగా విడిపోయింది అని చెప్పాలి. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాలో కృతిసనన్ కూడా నటిస్తోంది. ఈ సినిమాను జూన్ 16న విడుదల చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ కోసం ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల దేశంలోని వివిధ థియేటర్లలో స్క్రీనింగ్ వేశారు. ఈ సందర్భంగా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.
‘ఆదిపురుష్’ ట్రైలర్‌ను మొదటిసారి 3Dలో చూసినపుడు చిన్న పిల్లోడిని అయిపోయాను. ఇది నాకు గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు ప్రభాస్. త్రీడీలో చూస్తున్నప్పుడు విజువల్స్, యానిమల్స్ దగ్గరగా రావడాన్ని థ్రిల్‌గా ఫీల్ అయ్యాను అని చెప్పాడు ప్రభాస్. ఈ టెక్నాలజీ మన దేశంలోనే ఫస్ట్ టైమ్. స్పెషల్‌గా 3D వెర్షన్ బిగ్ స్క్రీన్ కోసం సిద్ధం చేశారు టీమ్ అని చెప్పాడు ప్రభాస్. ఆఖరుగా మరో మూడు వారాల్లో మరొక పెద్ద అప్‌డేట్‌తో ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేస్తాం అని చెప్పాడు.
అయితే ప్రభాస్ ఎగ్జైట్ అవుతున్నంత కంటెంట్, స్టఫ్ (Adipurush )ట్రైలర్‌లో లేదని విమర్శలు వస్తున్నాయి. చిన్న పిల్లల సినిమాలా ఉందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది అయితే చిన్న పిల్లల సినిమా తీస్తే.. చిన్నపిల్లాడిలా చూడాల్సి ఉంటుంది అంటున్నారు. గతంలో టీజర్ సమయంలోనూ ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అని చెప్పొచ్చు.