టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ (Prabhas) క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ పరంగా టాప్ లో ఉండగా ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాతో ఎన్నో అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పారితోషికం సైతం 120 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆర్మాక్స్ సర్వేలో టాప్ గా నిలిచిన ప్రభాస్ నేషనల్ వైడ్ గా కూడా టాప్ లో నిలవడం కొసమెరుపు.
దేశంలోనే మోస్ట్ పాపులర్ హీరోగా నంబర్ వన్ స్థానంలో ప్రభాస్ నిలవడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. దేశవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ హీరోల జాబితాను ఈ సంస్థ రిలీజ్ చేయగా జూన్ నెలలో ప్రభాస్ నంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు (Shah Rukh Khan) రెండో స్థానం దక్కింది. కోలీవుడ్ స్టార్ విజయ్ కు (Vijay Thalapathy) ఈ లిస్ట్ లో మూడో స్థానం దక్కడం గమనార్హం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఈ లిస్ట్ లో నాలుగో స్థానంలో నిలవగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఐదో స్థానంలో నిలిచారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు (Mahesh Babu) ఈ జాబితాలో ఆరో స్థానం దక్కింది. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా దేశవ్యాప్తంగా ఈ స్టార్ హీరో క్రేజ్ మామూలుగా లేదు. మహేష్ బాబుకు ఆరో స్థానం దక్కడం అభిమానులను ఎంతో ఆనందానికి గురి చేసిందని చెప్పవచ్చు.
ఈ జాబితాలో ఏడో స్థానంలో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఎనిమిదో స్థానంలో సల్మాన్ ఖాన్ (Salman Khan) నిలవగా రామ్ చరణ్ (Ram Charan) తొమ్మిదో స్థానంలో హృతిక్ రోషన్ (Hrithik Roshan) పదో స్థానంలో నిలిచారు. టాప్ టెన్ జాబితాలో ఐదుగురు టాలీవుడ్ హీరోలకు ఛాన్స్ దక్కింది. ఈ లిస్ట్ లో బాలీవుడ్ హీరోలను మించి టాలీవుడ్ హీరోలకు ప్రాధాన్యత దక్కింది. భవిష్యత్తులో మరి కొందరు టాలీవుడ్ స్టార్స్ కు సైతం ఈ జాబితాలో చోటు దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి.