గతంలో చిన్న సన్నివేశం అయినా అందరూ రిహార్సల్స్ చేసి కెమెరా ముందుకు వచ్చేవారు. డిజిటల్ యుగం కావడంతో ఆ పద్ధతి పూర్తిగా మారిపోయింది. కానీ బాహుబలి కోసం ప్రతి షాట్ ని ముందుగానే రిహార్సల్స్ చేసి రాజమౌళి తెరకెక్కించారు. ముఖ్యంగా కత్తి ఫైట్స్ కోసం ప్రభాస్ ప్రతి రోజు ప్రాక్టీస్ చేసి సెట్స్ కి వచ్చారు. ఆ కష్టం మంచి ఫలితాన్ని ఇచ్చింది. అదే పద్దతిని సాహో సినిమాకి పాటిస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేశారు. దుబాయ్ లోని అబుదాబి ప్రాంతంలో ఈ ఫైట్ తెరకెక్కించనున్నారు. హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఈ యాక్షన్ సీన్ కంపోజ్ చేశారు.
డైరక్ట్ గా లొకేషన్ కి వెళితే ఇబ్బంది అవుతుందని, ముందుగానే ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిసింది. పర్ఫెక్షన్ కోసం ప్రభాస్ తీవ్రంగా కష్టపడుతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. రెండు రోజుల్లో దుబాయ్ లో రెండో షెడ్యూల్ మొదలు కానుంది. కీలక సీన్లు అక్కడ కంప్లీట్ చేయనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.