ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. రాజాసాబ్ (The Rajasaab), ఫౌజీ, స్పిరిట్ (Spirit) , సలార్ 2, కల్కి 2 వంటి సినిమాలతో తన లైనప్‌ను బలంగా ప్లాన్ చేసుకున్నాడు. ప్రత్యేకంగా ఫౌజీ మూవీపై విపరీతమైన హైప్ ఏర్పడింది. హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా, 1940ల నాటి కథతో రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత హనూ, ప్రభాస్ కోసం మరో కథ సిద్ధం చేస్తున్నాడని తాజా సమాచారం.
సీతారామం (Sita Ramam) వంటి క్లాసిక్ హిట్ తర్వాత హనూ ఫౌజీ ద్వారా యాక్షన్ జానర్‌ను టచ్ చేస్తున్నాడు. ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా, భారత స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో సుభాష్ చంద్రబోస్‌తో కనెక్షన్ ఉన్న కథాంశంతో రూపొందనుంది. ఈ మూవీ పూర్తి కాకముందే హోంబలే ఫిల్మ్స్ హనూ కోసం మరో ప్రాజెక్ట్‌ను లాక్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ముందుగా అడ్వాన్స్ కూడా చెల్లించినట్లు సమాచారం.
అయితే, ప్రభాస్ లైనప్ చూసుకుంటే, ఈ రెండో ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదు. ఇప్పటికే రాజాసాబ్, ఫౌజీ షూటింగ్‌లో ప్రభాస్ బిజీగా ఉండగా, జూన్ నుంచి స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు సలార్ 2 షూటింగ్ కూడా ఒకే సమయంలో జరగనుంది. ఈ షెడ్యూల్స్ మధ్య హనూ రెండో సినిమా ఎప్పుడు మొదలవుతుందన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.
సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఫౌజీ విడుదలైన తర్వాతే ఈ కొత్త ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అంటే 2026కే ఇది ఖరారవుతుందా లేదా అన్నది చూడాలి. హోంబలే ఫిల్మ్స్ ప్రాజెక్ట్ దాదాపు కన్‌ఫర్మ్ అయినా, ప్రభాస్ ఫ్యూచర్ లైనప్ చూసి ఫైనల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికి, హనూ-ప్రభాస్ కాంబో మరోసారి వెండితెరపై రిపీట్ అవడం పక్కా.