మలయాళం సినిమా అంటే ఒకప్పుడు ఆడియన్స్ లో వేరే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళు హై స్టాండర్డ్స్ తో సినిమాలు చేస్తున్నారు. వరుసగా హిట్లు కొడుతున్నారు. అలా మన తెలుగులో సినిమాలు రావడం లేదు. ఇలాంటి అభిప్రాయాలు చాలా మందిలో ఉన్నాయి. ఇలాంటి వాటికి స్టార్ రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ (Prasanna Kumar Bezawada) తన శైలిలో సమాధానం ఇచ్చాడు. అతను మాట్లాడుతూ.. “మలయాళం సినిమాకి మన సినిమాకి తేడా ఏంటంటే సార్..
తెలుగు సినిమాల్లో ఫస్ట్ పావు గంటలో చెప్పే విషయాన్ని, మలయాళ సినిమాల్లో 2 గంటలు చెబుతారు వాళ్ళు. అది మనకు సరిపోదు. ఒక అమ్మ, నాన్న తిరునాళ్ళకు వెళ్ళొచ్చారు.. ఆ ఇన్సిడెంట్ తో సినిమా తీసేస్తారు వాళ్ళు. ‘ఒక పోలీసోడికి.. సినిమా హీరోకి మధ్య ఈగో. పోలీసోడు ఫోటో అడిగితే హీరో ఫోటో ఇవ్వలేదు’.. అది డ్రైవింగ్ లైసెన్స్. ఇదే కథ మీద వాళ్ళు 3 సార్లు సినిమా తీశారు.
ఇందులో కథ లేదు. ఒక ఇన్సిడెంట్ ఇది. మన సినిమాల్లో ఇది హీరో ఇంట్రడక్షన్. నన్ను మొన్నామధ్య ఒకరు అడిగారు. ‘రైడ్’ సినిమా రవితేజ గారితో రీమేక్ చేస్తున్నారు. వర్కౌట్ అవుతుందంటావా? అని..! అప్పుడు నేను ‘రవితేజ (Ravi Teja) గారు విలన్ ఇంటికి వెళ్లి రైడ్ చేసి వచ్చారు అనేది ఇంట్రడక్షన్ సీన్. ఇక్కడి నుండి కథ మొదలవ్వాలి.
రవితేజ గారి మాస్ ఇమేజ్ కి ఒక హీరో లేదా ఎమ్మెల్యేని కొట్టి రోడ్డు మీదకు తీసుకొచ్చాడు అనేది హీరో ఇంట్రడక్షన్.మన తెలుగు వాళ్ళకి అది సరిపోదు. కానీ కొంతమందేమో మలయాళం వాళ్ళు తీసే సినిమాలు ఇక్కడ రావాలి రావాలి అంటారు. ఒకవేళ తీస్తే.. థియేటర్ కి వెళ్ళి నిద్రపోతాం మనం” అంటూ ప్రసన్నకుమార్ బెజవాడ (Prasanna Kumar) చెప్పుకొచ్చాడు.
— Mary. The unfortunate RaviTejа fan ❤️ (@RussianFanRT) March 3, 2025