పాన్ ఇండియా సినిమా ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకి కూడా వెయ్యి కోట్లు బిజినెస్ జరిగింది. ట్రైలర్ కూడా అదిరిపోయింది. సో డిసెంబర్ 5న విడుదల కాబోతున్న ‘పుష్ప 2’ భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఆ లెక్కలు పెంచడానికి చిత్ర బృందం ప్రమోషన్స్ డోస్ ను పెంచుతూనే ఉంది. ఇప్పటికే పాట్నాలో, చెన్నైలో.. ఈవెంట్లు చేసింది. ఈరోజు కొచ్చిలో కూడా ఈవెంట్ చేస్తూ మలయాళం మార్కెట్ ను కవర్ చేయబోతున్నారు.
Pushpa 2 The Rule
త్వరలోనే బెంగళూరు, హైదరాబాద్లో కూడా ఈవెంట్లు నిర్వహించబోతున్నారు. మరోపక్క టికెట్ రేట్లు పెంపు అనుమతుల కోసం తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలను కోరుతూ లెటర్లు ఇవ్వడం కూడా జరిగింది. అంతా బాగానే ఉంది. కానీ, రన్ టైమ్ విషయంలో మాత్రం అభిమానులు ఒకింత కంగారు పడుతున్నారు. ‘పుష్ప 2’ రన్ టైమ్ 3 గంటల 21 నిమిషాలు వచ్చింది అనేది ఇండస్ట్రీ టాక్. తాజాగా ఆ విషయాన్ని నిర్మాత నవీన్ ఎర్నేని కూడా కన్ఫర్మ్ చేశారు.
ఈ రోజు జరిగిన ‘రాబిన్ హుడ్’ (Robinhood) సాంగ్ లాంచ్ ఈవెంట్లో భాగంగా నిర్మాత నవీన్ ఎర్నేనికి (Naveen Yerneni) ‘పుష్ప 2’ రన్ టైమ్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి నవీన్ ఎర్నేని స్పందిస్తూ.. ” ‘పుష్ప 2’ రన్ టైమ్ విషయంలో మాకు ఎటువంటి కంగారు లేదు. సినిమా చూసిన తర్వాత రన్ టైమ్ విషయంలో ఎవ్వరూ కంప్లైంట్ చేయరు. అంత బాగుంటుంది సినిమా.
మీకు మూడున్నర గంటలు కూర్చుకున్న ఫీలింగ్ అస్సలు కలుగదు” అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సుకుమార్ (Sukumar) గత చిత్రం ‘రంగస్థలం’ (Rangasthalam) కూడా 3 గంటల రన్ టైమ్ కలిగి ఉంటుంది. గతేడాది చివర్లో వచ్చిన ‘యానిమల్’ (Animal) కూడా మూడున్నర గంటల రన్ టైమ్ ఉంటుంది. అయినా ఆ సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. మరి ‘పుష్ప 2’ నిర్మాత చెప్పిన రేంజ్లో ఉంటుందో లేదో తెలియాల్సి ఉంది.