‘లైగర్'(Liger) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) వంటి సినిమాలతో డీలా పడ్డాడు పూరీ (Puri Jagannadh) . అవి ఒక దాన్ని మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్స్ అయ్యాయి. అంతేకాకుండా ‘లైగర్’ సినిమాకి డిస్ట్రిబ్యూటర్లు అంతా.. తమ నష్టాలు తీర్చాలి అంటూ ఛాంబర్ ను ఆశ్రయించారు. తర్వాత బయట ధర్నాలు వంటివి కూడా చేశారు. ఇలాంటి వివాదాల్లో పూరీ చిక్కుకోవాల్సి వచ్చింది. మరోపక్క విజయ్ దేవరకొండతో (Vijay Devarakonda) చేయాల్సిన ‘జన గణ మన'(బెజిఎం) కూడా ఓపెనింగ్ అయిన వెంటనే ఆగిపోయింది.
Puri Jagannadh
ఆ తర్వాత పూరీతో సినిమాలు చేయడానికి హీరోలు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఓ దశలో నాగార్జున (Nagarjuna), గోపీచంద్ (Gopichand)..లతో పూరీ సినిమాలు ఫిక్స్ అనే టాక్ కూడా వినిపించింది. కానీ వాళ్ళు కూడా వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల వర్కౌట్ కాలేదు.అయినప్పటికీ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) వంటి క్రేజీ హీరోని పట్టేశాడు పూరీ. ‘మహారాజ’ తో (Maharaja) విజయ్ సేతుపతి మళ్ళీ హీరోగా మారి పెద్ద హిట్ కొట్టాడు.
అది దాదాపు రూ.200 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగులో కూడా అది బాగా ఆడింది. కాబట్టి పూరీకి విజయ్ సేతుపతి మంచి ఆప్షన్ అనే చెప్పాలి. పైగా విజయ్ సేతుపతి కంటెంట్ సెలక్షన్ పై కూడా జనాల్లో నమ్మకం ఉంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే.. పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా టైంలో కొంచెం ఒళ్ళు చేసినట్లు కనిపించాడు.
కానీ ఇప్పుడు అతను బాగా స్లిమ్ అయ్యాడు అని చెప్పాలి. ఈరోజు తన నెక్స్ట్ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబుని (Tabu) ఓ కీలక పాత్రకి కన్ఫర్మ్ చేసినట్టు అధికారికంగా తెలిపారు పూరీ, ఛార్మి (Charmy Kaur) అండ్ టీం. ఇందులో భాగంగా విడుదల చేసిన ఫోటోలో పూరీ స్లిమ్ గా కనిపించి సర్ప్రైజ్ చేశాడు.