ఎస్.ఎస్.రాజమౌళి (Rajamouli) తెలుగు సినిమా స్థాయిని వంద రెట్లు పెంచిన దర్శకుడు. తెలుగు సినిమా పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగింది అంటే అది ఆయన వల్లే అని చెప్పాలి. ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్ కలిగిన సినిమాలు రూపొందుతున్నాయి అన్నా.. దానికి కారణం రాజమౌళినే..!సినిమా పట్ల ఆయన విజన్ చాలా గొప్పది. అలాగే రాజమౌళికి సరితూగే నిర్మాత టాలీవుడ్లో ఎవరైనా ఉన్నారా? అంటే అది డౌట్ లేకుండా అల్లు అరవింద్ అనే చెప్పాలి.
Rajamouli
వీరిద్దరి కాంబినేషన్లో ‘మగధీర’ (Magadheera) సినిమా వచ్చింది. అది ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు. అయితే ఈ సినిమా విషయంలో రాజమౌళికి అల్లు అరవింద్ (Allu Aravind) కోపం తెప్పించారట. ఎందుకు అనేది ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు రాజమౌళి. ఆయన మాట్లాడుతూ.. ” గతంలో బ్లాక్ బస్టర్ సినిమాలకి వంద రోజులు ఇన్ని కేంద్రాలు అంటూ వేసేవారు. రికార్డుల కోసం కొన్ని సెంటర్లు బలవంతంగా ఆడించేవారు కూడా.
‘సింహాద్రి’ (Simhadri) సినిమా కొన్ని నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో వంద రోజులు ఆడింది. జెన్యూన్ గా ఆడింది. దానికి మేము చాలా ఆనందపడ్డాం. కానీ తర్వాత 175 రోజులు రికార్డుల కోసం ఆడించారు. అలాంటివి చాలా సినిమాల విషయంలో జరిగాయి. అయితే ‘ఇలాంటివి మనకు వద్దు సార్’ అని మగధీర స్టార్ట్ అయ్యే ముందే నేను అల్లు అరవింద్ గారికి చెప్పాను. అయినా సరే రికార్డుల కోసం ‘మగధీర’ కి కొన్ని కేంద్రాల్లో వంద రోజులు ఆడించారు.
అది పెద్ద హిట్ సినిమా. అన్ని విధాలుగా..! అయినా ఎందుకు సార్ అని నేను అల్లు అరవింద్ గారిని అడిగితే.. ‘ఫ్యాన్స్ కోసం తప్పట్లేదు రాజమౌళి’ అన్నట్టు సమాధానం ఇచ్చారు. మనది కానిది మనది అని చెప్పుకుని ఎలా ఆనందపడతాం?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రాజమౌళి. ‘అత్తారింటికి దారేది’ (Atharintiki Daaredi) సినిమాకి ముందు ఇండస్ట్రీ హిట్ సినిమా అంటే ‘మగధీర’ నే అని చాలా మందికి తెలిసే ఉంటుంది.