రజనీకాంత్ నటించిన లాల్ సినిమా తెలుగు, తమిళ రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కాగా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. అయితే ఈ సినిమా రజనీకాంత్ స్థాయికి తగ్గ సినిమా కాదని ఫ్యాన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. రజనీకాంత్ గతంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాలేదు. అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రశ్నలు ఎదురు కాగా రజనీకాంత్ తనదైన శైలిలో స్పందించారు.
ఆ ప్రశ్నలకు రజనీకాంత్ స్పందిస్తూ నో పాలిటిక్స్ ఓన్లీ సినిమా అంటూ కామెంట్లు చేయడం గమనార్హం. పాలిటిక్స్ గురించి మీడియా నుంచి ప్రశ్నలు ఎదురుకాగా రాజకీయాల గురించి ప్రశ్నలు వేయొద్దంటూ రజనీకాంత్ చురకలు అంటించారు. తనకు పాలిటిక్స్ పై ఏ మాత్రం ఆసక్తి లేదని రాజకీయాలకు సంబంధించి పదేపదే ప్రశ్నలు అడగవద్దని తన కామెంట్ల ద్వారా రజనీకాంత్ చెప్పకనే చెప్పేశారు.
రజనీకాంత్ లాల్ సలామ్ విషయంలో చేసిన తప్పులను తర్వాత సినిమాల విషయంలో రిపీట్ చేయవద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రజనీకాంత్ సినిమాలకు హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ షేక్ అవుతుందని అదే సమయంలో ఫ్లాప్ టాక్ వస్తే ఊహించని స్థాయిలో నష్టాలు వస్తాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రజనీకాంత్ జైలర్ తరహా కథలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
జైలర్ మూవీ పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. లాల్ సలామ్ మాత్రం ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే. జైలర్ సినిమా సీక్వెల్ కు సంబంధించిన అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రజనీకాంత్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తారేమో చూడాల్సి ఉంది. రజనీకాంత్ కు (Rajinikanth) క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.