మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Game Changer) నటించిన ‘గేమ్ ఛేంజర్'(Game Changer). దిల్ రాజు (Dil Raju) నిర్మించిన ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకుడు. తెలుగులో శంకర్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఇది. పైగా పాన్ ఇండియా సినిమా. దీంతో అంచనాలు భారీగా పెరిగాయి. టీజర్ పెద్దగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు కానీ.. ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో భారీ తారాగణం ఉంది.కియారా అద్వానీ (Kiara Advani), అంజలి (Anjali ) హీరోయిన్లు కాగా..
Ram Charan
శ్రీకాంత్ (Srikanth), ఎస్.జె.సూర్య (SJ Suryah) , సునీల్ (Sunil) , జయరాం (Jayaram).. వంటి వాళ్ళు కూడా నటిస్తున్నారు. తమన్ (S.S.Thaman) ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ‘జరగండి’ ‘రా మచ్చ మచ్చ’ ‘నానా హైరానా’ వంటి పాటలు యూట్యూబ్లో వైరల్ అయ్యాయి. ఇక జనవరి 10న అంటే సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం కూడా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో రాంచరణ్ పాల్గొన్న..
ఓ ఇంటర్వ్యూలో అతనికి ఓ విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. ‘మీ కెరీర్లో పలానా సినిమా చేసుండకపోతే బాగుణ్ణు అని మీరు ఎప్పుడైనా ఫీలైన సందర్భాలు ఉన్నాయా?’ అనే ప్రశ్న ఎదురైంది. అందుకు అతను ‘ ‘జంజీర్’ (Zanjeer) చిత్రాన్ని రీమేక్ చేసి తప్పు చేశాను అనిపిస్తుంది. ఆ సినిమా విషయంలో బాధపడ్డాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అమితాబ్ బచ్చన్ క్లాసిక్ మూవీ ‘జంజీర్’ ను చరణ్ తో రీమేక్ చేశారు బాలీవుడ్ వాళ్ళు.
ఇది చరణ్ బాలీవుడ్ డెబ్యూ మూవీ. బాక్సాఫీస్ వద్ద ఇది పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) ప్రమోషన్స్ లో కూడా ఓ యాంకర్ ‘ ‘జంజీర్’ సినిమాకి వెళ్తే థియేటర్ మొత్తం ఖాళీగా ఉంది. అందువల్ల సినిమా చూస్తూ నేను నిద్రపోయాను’ అంటూ సెటైర్లు వేసిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది.