దగ్గుబాటి రానా.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. దగ్గుబాటి కుటుంబంలో మూడో తరాన్ని రిప్రజెంట్ చేస్తున్న ఈ హీరో… తాత, తండ్రి, బాబాయ్‌ల వారసత్వాన్ని నిలబెడుతున్నాడు. పాత్ర కోసం ప్రాణం పెడుతూ.. విలక్షణ నటుడిగా, ఎల్లప్పుడూ వైవిధ్యానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. కథ నచ్చిందా అందులో ఎంత రిస్క్ ఉన్నా చేయడానికి వెనుకాడడు. అందుకే రానా అంటే అందరికీ ఇష్టం. హీరోగా బ్లాక్ బస్టర్ అందుకుని ఆ వెంటనే మరో సినిమాలో విలన్ రోల్ వేయడానికి రెడీ అంటాడు.. అదే రానా స్పెషల్. నిర్మాతల హీరోగా, దర్శకులకు సహకరించే వ్యక్తిగా రానాకు ఇండస్ట్రీలో పేరుంది.
ఇదిలావుండగా.. రానా (Rana) డేరింగ్ అండ్ డ్యాషింగ్ వ్యక్తిత్వం గురించి మరో ఇన్సిడెంట్ ఇప్పుడు ఫిలింనగర్ లో వైరల్ అవుతోంది. సాధారణంగా చిత్ర పరిశ్రమ.. ‘‘విజయం’’ వైపే ఉంటుంది. సినిమా భాషలో సక్సెస్. విజయాలను అందుకున్న దర్శకులు, హీరోలు, హీరోయిన్ల వెంటే పరిశ్రమ పరిగెడుతుందన్నది కాదనలేని సత్యం. నాటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఇదే సూత్రాన్ని అంతా తూచా తప్పకుండా పాటిస్తారు. అంతకుముందు ఎన్ని హిట్స్ ఇచ్చినా సరే.. ఒక్క ఫ్లాప్ పడిందంటే ఆ వ్యక్తిని ఎలా చూస్తారో చెప్పడానికి తెలుగు చిత్ర పరిశ్రమలో నిదర్శనాలు కోకొల్లలు.
ప్రత్యేకించి ఫ్లాప్స్ ఇచ్చిన దర్శకులను ఇండస్ట్రీ ఎలా ట్రీట్ చేస్తుందో మన కళ్లెదుట ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అలాంటిది ఫ్లాప్ డైరెక్టర్‌తో సినిమా చేయాలంటే హీరోకి ఎన్ని గట్స్ ఉండాలి. అలాంటి అరుదైన హీరోనే రానా. అసలు విషయంలోకి వెళితే.. ఆయన తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా ‘అహింస’ అనే సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. దీనికి తేజ దర్శకుడు. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న తేజ ఖచ్చితంగా సాలిడ్ హిట్ కొడతాడని అంతా అనుకున్నారు. కానీ రిజల్ట్ రివర్స్ అయ్యింది. అ‘హింస’ మేం భరించలేమని జనం థియేటర్లకు రావడం మానేశారు.
ఈ సినిమా ఫ్లాప్ కావడంతో తేజ కెరీర్ డైలామాలో పడింది. అలాంటి వ్యక్తితో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా సినిమా చేస్తారా.? కానీ తేజది మామూలు మైండ్ కాదు కదా. అహింస కంటే ముందే రానాని లాక్ చేసేశాడు. మళ్లీ ఎప్పుడు ఏం జరుగుతుందోనని అహింస ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో తన నెక్ట్స్ సినిమా తేజతోనేనని రానాతో అనౌన్స్ చేయించాడు. కట్ చేస్తే ఇప్పుడు అహింస ఫ్లాప్ అయ్యింది. మరి రానా ఇప్పుడు తేజతో సినిమా చేస్తాడా అనే గాసిప్స్ మొదలయ్యాయి. కానీ అలాంటి వాటికి భయపడే రకం కాదు రానా. త్వరలోనే తేజ సినిమాను పట్టాలెక్కిస్తాడని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.