చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. అలాగే చక్కనమ్మ సారీ చెప్పినా అందంగానే ఉంటుంది. ఈ విషయంలో మీకు ఏమన్నా డౌట్ ఉందా? అయితే రష్మిక మందన (Rashmika Mandanna) చెప్పిన సారీ చూడండి మీకే తెలుస్తుంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న నేషనల్ క్రష్ రష్మికకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆమె ఓ సినిమా పేరు తప్పుగా చెప్పింది. ఆ విషయంలోనే సారీ కూడా చెప్పింది.
Rashmika
తమిళ స్టార్ హీరో విజయ్‌కి (Vijay Devarakonda) రష్మిక మందన వీరాభిమాని అనే విషయం తెలిసిందే. గతంలో చాలా సందర్భాల్లో చెప్పింది కూడా. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను థియేటర్‌లో చూసిన మొదటి సినిమా విజయ్ ‘గిల్లి’ (Ghilli) అని చెప్పింది. ఆ సినిమా గురించి వివరిస్తూ ఆ సినిమా తెలుగులో మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా వచ్చిన ‘పోకిరి’ (Pokiri) సినిమాకు రీమేక్ అని అంది.
ఆ సినిమాలోని ఓ పాట అంటే తనకెంతో ఇష్టమని, ఆ పాటకు ఎన్నోసార్లు స్టేజ్ మీద డ్యాన్స్ చేసినట్లు కూడా ఆమె చెప్పింది. తాను స్క్రీన్ మీద చూసిన మొదటి హీరో విజయ్ అని, ఫస్ట్ హీరోయిన్ త్రిష (Trisha) ఆ సినిమా గురించి వివరించింది. ఫ్లోలో చదివితే మీకు కూడా డౌట్ రాలేదు అనుకుంటా. ఎందుకంటే ‘గిల్లి’ సినిమాకు ఒరిజినల్ వెర్షన్ ‘పోకిరి’ కాదు.. ‘ఒక్కడు’ (Okkadu). ఈ పాయింట్ పట్టుకుని నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
అయితే, విషయం అర్థం చేసుకున్న రష్మిక సారీ చెప్పింది. ఈ మేరకు ఓ పోస్ట్‌కు రష్మిక తెలుగులో రిప్లై పెట్టారు. ‘అవును. సారీ ‘గిల్లి సినిమా’… ‘ఒక్కడు’కు రీమేక్ కదా.. అని ఇంటర్వ్యూ అయిపోయాక అనుకున్నా. ‘పోకిరి’ సినిమాను అదే పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూను ఇప్పుడు వైరల్ చేసేస్తారు అని కూడా అనుకున్నా. నిజంగా సారీ’ అని రాసుకొచ్చింది రష్మిక.