టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా మూడు ఇండస్ట్రీలలో తనదైన స్టైల్‌తో కొనసాగుతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna), ఇప్పుడు మరో హిందీ క్రేజీ ప్రాజెక్ట్‌లో జాయిన్ అవ్వబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. 2012లో విడుదలైన హిట్ మూవీ కాక్‌టెయిల్ కు సీక్వెల్ రెడి అవుతుండగా, ఇందులో రష్మిక కీలక పాత్రలో నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని టాక్. ఈ సీక్వెల్ ‘కాక్‌టెయిల్ 2’ పేరుతో రూపొందబోతున్నది. శాహిద్ కపూర్ (Shahid Kapoor), కృతి సనన్ (Kriti Sanon) ఇప్పటికే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ప్రేమ కథలో, రష్మిక రెండో హీరోయిన్ పాత్రకు కన్‌ఫర్మ్ అయ్యిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ సినిమా సాగే నేపథ్యం ట్రెడిషనల్ లవ్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ అయినా, ప్రస్తుతం ఉన్న తరం ప్రేమకథలను ప్రతిబింబించేలా ఉండబోతుందట. ఈ ప్రాజెక్ట్‌కు లవ్ రంజన్ కథ అందించగా, మొదటి భాగానికి దర్శకత్వం వహించిన హోమీ అదజానియానే ఈ సీక్వెల్‌కూ డైరెక్షన్ చేస్తారు. దినేష్ విజన్ (Dinesh Vijan) నిర్మాతగా వ్యవహరిస్తుండగా, సినిమాను 2026 మధ్యలో రిలీజ్ చేయాలన్న యోచనలో మేకర్స్ ఉన్నారు.
ఇప్పటికే రష్మిక హిందీలో మిషన్ మజ్ను (Mission Majnu), గుడ్‌బై అనిమల్, ఛావా (Chhaava) వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. ఇప్పుడు కాక్‌టెయిల్ 2 లాంటి ఎమోషనల్ డ్రామాలో నటించడం ఆమెకు భారీ అడ్వాంటేజ్ అవుతుందనే మాట వినిపిస్తోంది. దీపికా పదుకోణెకు (Deepika Padukone) కాక్‌టెయిల్ సినిమాలోని వెరోనికా పాత్ర బ్రేక్‌థ్రూ ఇచ్చినట్టే, రష్మిక చేసే పాత్ర కూడా ఆమె కెరీర్‌కు మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
ముఖ్యంగా హిందీ ప్రేక్షకుల్లో గ్లామర్‌తో పాటు ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్స్‌ను చూసేందుకు ఆదరణ పెరుగుతున్న సమయంలో రష్మికను ఈ చిత్రానికి ఎంచుకోవడం కూడా చాలా స్మార్ట్ మూవ్ అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై అధికారిక ప్రకటన రాకపోయినా, పరిశ్రమలో జోరుగా వినిపిస్తున్న హింట్స్‌ను బట్టి రష్మిక మరో బిగ్‌చాన్స్ సొంతం చేసుకున్నట్లు అర్థమవుతోంది.