ఒక సినిమా హిట్టైతే ఆ క్రెడిట్ ను దర్శకుడు, హీరో, హీరోయిన్, సంగీత దర్శకుడు, నిర్మాత ఇలా చాలా మంది షేర్ చేసుకుంటారు. కానీ ఒక సినిమా ఫ్లాప్ అయ్యిందంటే మాత్రం తప్పంతా దర్శకుడి మీదకే తోసేస్తారు. కానీ.. విచిత్రంగా విజయ్ దేవరకొండ సినిమాల విషయంలో మాత్రం ఈ ఫెయిల్యూర్ క్రెడిట్ మొత్తం విజయ్ మీదకే వస్తుంది. అందుకు కారణం దర్శకత్వ శాఖలో విజయ్ కెలుకుడే అని తెలుస్తోంది. విజయ్ గత ఫ్లాప్ చిత్రం “డియర్ కామ్రేడ్” కానీ తాజా చిత్రం “వరల్డ్ ఫేమస్ లవర్” కానీ డిజాస్టర్లుగా నిలవడానికి కారణం విజయ్ అని, విజయ్ కొన్ని సన్నివేశాలను డైరెక్ట్ చేయడమే డిజాస్టర్ కు కారణమని చెప్పుకొంటున్నారు.
కెరీర్ తొలినాళ్లలో విజయ్ అందుకున్న విజయాలు కానీ.. సొంతం చేసుకున్నా స్టార్ డమ్ కానీ ఇతర హీరోలు ఈర్ష్యపడే స్థాయిలో ఉంటే.. ప్రస్తుతం అతడి చిత్రాల కలెక్షన్స్, రిజల్ట్స్ మాత్రం వాళ్ళందరూ నవ్వుకునేలా ఉన్నాయి. మరి సంపాదించుకున్న స్టార్ డమ్ & క్రేజ్ ను కాపాడుకోవడంలో విజయ్ దారుణంగా విఫలమవుతున్నాడు. పూరీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా ఈ పరాజయాల పరంపరకు బ్రేక్ వేస్తుందేమో చూడాలి.