బిగ్ బాస్ హౌస్ లో 7వ వారం నామినేషన్స్ వీరలెవల్లో జరిగాయి. ఇందులో భాగంగా నామినేట్ అయిన ఇంటిసభ్యులు బురద షవర్ లో స్నానం చేయాలి. ఇక్కడే అత్యధికంగా బాలాదిత్య తర్వాత రేవంత్ కి ఓట్లు వేశారు హౌస్ మేట్స్. ఏకంగా ఆరుగురు హౌస్ మేట్స్ ఓట్లు వేశారు. అందరూ ఒకే రీజన్ చూపించారు. హౌస్ లో కెప్టెన్ అయ్యి కూడా రెండుసార్లు నిద్రపోయావ్ అని, అందుకే బ్యాటరీ టాస్క్ లో 10 శాతాన్ని కోల్పోవాల్సి వచ్చిందని అందరూ ఒకటే రీజన్ చెప్పారు. దీంతో రేవంత్ కొద్దిగా అసహనాన్నికి గురి అయ్యాడు.
అందరి దగ్గర పాయింట్స్ లేక కేవలం ఇదే పాయింట్ తో నామినేట్ చేస్తున్నారని, హౌస్ లో అందరూ సేఫ్ గా ఆడుతున్నారని ఫ్రస్టేట్ అయ్యాడు. ఆఖరి ఓటు సూర్యది పడగానే షవర్ దగ్గరకి వెళ్లి షర్ట్ తీసేసి, ఏమైనాకానీ, ఏదైనా కానీ నీ యవ్వ తగ్గేదేలే అంటూ పుష్పలో మేనేజరిజం చేసి రెచ్చిపోయాడు. దీనికి సూర్యతో పాటుగా హౌస్ మేట్స్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఆడియన్స్ మాత్రమే కాదు, ఇప్పుడు సోషల్ మీడియాని ఈ వీడియో క్లిప్ ఒక ఊపు ఊపేస్తోంది.
అసలు ఏం జరిగిందంటే, బ్యాటరీ టాస్క్ ఆటలో హౌస్ లో రూల్స్ పాటించకపోతే బ్యాటరీ 5శాతం పడిపోతుందని ముందుగానే బిగ్ బాస్ హెచ్చరించాడు. కానీ, రేవంత్ రెండుసార్లు పడుకునేసరికి కుక్కలు మొరిగాయి. దీంతో బ్యాటరీ 10శాతం రేవంత్ వల్ల కోల్పోయింది. అలాగే, అందరికంటే ఎక్కువ శాతం బ్యాటరీని ఆడియోకాల్ కోసం ఆదిత్య ఉపయోగించాడు. తన పాపకి పేరు పెట్టాలంటే 45శాతం బ్యాటరీ వాడుకోవాలి అన్నప్పుడు బ్యాటరీ పర్సెంట్ జీరో అయిపోతుందని తెలిసినా కూడా అదే ఆఫ్షన్ ని తీస్కున్నాడు.
దీంతో బ్యాటరీ రీఛార్జ్ చేయాలంటే రోహిత్ రెండువారాలు నామినేట్ అవ్వాల్సి వచ్చింది. ఇక నామినేషన్స్ అప్పుడు హౌస్ మేట్స్ అందరూ ఇవే రీజన్స్ చూపించి బాలాదిత్యకి, రేవంత్ కి ఓట్లు బాగా గుద్దారు. రేవంత్ పుష్ప రేంజ్ లో ఇమిటేట్ చేస్తూ రెచ్చిపోయిన ఈవీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అంతేకాదు, రేవంత్ ఫ్యాన్స్ ఈవీడియోని తెగ షేర్లు చేస్తున్నారు.
మంచి టైమింగ్ లో పుష్ప ని ఇమిటేట్ చేయడం, అందులోనూ షర్ట్ తీసేసిన తర్వాత ఇలా చేయడం అనేది ఇప్పుడు ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తోంది. నామినేషన్స్ లో అంత హీట్ లేకపోయినా రేవంత్ చేసిన ఈ పనికి ఈనామినేషన్స్ హైలెట్ అయిపోయాయి. నిజానికి ప్రోమో వచ్చినప్పటి నుంచే ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ చూద్దామా అని ఆడియన్స్ తెగ ఆరాటపడ్డారు. ఇక రేవంత్ ఫ్యాన్స్ అయితే, ఈ ఒక్క వీడియో చాలు విన్నర్ అవ్వడానికి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అదీ మేటర్.