రాజమౌళి డైరెక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ వేర్వేరు కారణాల వల్ల ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా మళ్లీ వాయిదా పడే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ పై మళ్లీ సస్పెన్స్ నెలకొనడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.
దేశంలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలవుతుండగా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలలో థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. జనవరి 7వ తేదీ నాటికి తెలుగు రాష్ట్రాలలో కూడా థియేటర్లపై ఆంక్షలు విధించే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. ఆర్ఆర్ఆర్ మూవీ దాదాపుగా 14 భాషల్లో రిలీజ్ కావాల్సి ఉండగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం దాదాపుగా పూర్తయ్యాయని సమాచారం.
ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్లకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ విడుదలైతే రికార్డు స్థాయిలో కలెక్షన్లు గ్యారంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సంబరాలకు ఒమిక్రాన్ బ్రేక్ వేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఈ వార్తల గురించి స్పందించి సినిమా రిలీజ్ గురించి స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ఆర్ఆర్ఆర్ థియేటర్లలో రిలీజయ్యే వరకు అభిమానులకు టెన్షన్ తప్పదనే చెప్పాలి. విడుదలైన తర్వాత ఆర్ఆర్ఆర్ ఎలాంటి రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుంచి అందుకుంటుందో చూడాలి. ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రచారాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో రిలీజ్ డేట్ మారకపోవచ్చని మరికొందరు భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ విడుదలైతే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ కావడం గ్యారంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చరణ్ తారక్ మధ్య ఫ్రెండ్ షిప్ ను సినిమాలో చూపించానని రాజమౌళి చెబుతుండటం గమనార్హం. ఆర్ఆర్ఆర్ అంచనాలను మించి విజయం సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది.