Samantha: సమంత తొలి రెమ్యూనరేషన్ అంత తక్కువా.. ఇప్పుడు మాత్రం కోట్లలో?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన సమంత ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం సమంత వరస పాన్ ఇండియా సినిమాలతో పాటు,హాలీవుడ్ చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ విధంగా ఈమె ఒక సినిమాకు దాదాపు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో అగ్ర తారగా కొనసాగుతున్న సమంతకు 500 రూపాయలతో విడదీయరాని అనుబంధం ఉంది.

ఏ విధమైనటువంటి సినీ నేపథ్యంలేని కుటుంబం నుంచి సమంత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే ఈమె కాలేజీ చదువుతున్న సమయంలో కేవలం పాకెట్ మనీ కోసం మోడలింగ్ రంగం వైపు అడుగు పెట్టారు. ఈ విధంగా సమంత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి అనంతరం సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సమంత తొలి రెమ్యూనరేషన్ తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే.

సమంత తన మొదటి పారితోషకముగా కేవలం 500 రూపాయలను తీసుకున్నారు. సమంత హయ్యర్ సెకండరీ స్కూల్ చదివే సమయంలో ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ కి అతిథులను ఆహ్వానించడం కోసం సమంత వెళ్ళగా, ఆ పని చేసినందుకు ఆమెకు 500 రూపాయలు ఇచ్చారు. ఈ విధంగా తన మొదటి సంపాదన 500 రూపాయలు అని సమంత ఓ సందర్భంలో బయటపెట్టారు.

ఈ విధంగా 500 రూపాయల నుంచి సమంత నేడు ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకొని స్థాయికి వెళ్లారు. ఇలా ఈ స్థాయికి రావడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం ఈమె యశోద, ఖుషి సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే తాప్సీ నిర్మాణంలో సమంత మరో బాలీవుడ్ సినిమా చేయనుందనీ సమాచారం. అలాగే ఈమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Share.