పొద్దున్న లేస్తే.. సామాన్యులు సినీ పరిశ్రమలో జరిగే విషయాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే.. ఇది గ్లామర్ కలిగిన పరిశ్రమ కాబట్టి..! సినిమా వాళ్ళ కొత్త ప్రాజెక్టుల గురించి, రెమ్యునరేషన్స్ గురించి మాత్రమే కాకుండా పర్సనల్ లైఫ్ గురించి కూడా జనాలకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ..! ఒకప్పుడు వీళ్ళ వ్యవహారాలు గురించి న్యూస్ పేపర్స్ లోనో, మ్యాగ్జైన్లలోనో ఎక్కువ న్యూస్ లు వచ్చేవి.
కానీ వెబ్ మీడియా, సోషల్ మీడియా పెరిగాక .. నటీనటులు ఏం మాట్లాడినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది.ఇదిలా ఉండగా.. కొంతమంది నటీనటులు కొన్ని సీక్రెట్ కాంట్రవర్సీల్లో ఇరుక్కున్నారు. బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండదు. అలాంటి నటీనటులు ఎవరు.. ఆ కాంట్రవర్సీలు ఏంటో ఇప్పుడో లుక్కేద్దాం రండి :
1) నాగార్జున :
2011 లో ఈ స్టార్ హీరో పై సునీత చౌదరి అనే జర్నలిస్ట్ కేసు ఫైల్ చేసింది. ఆ జర్నలిస్ట్ తో నాగార్జున దురుసుగా ప్రవర్తించాడని, అలాగే బూతులు కూడా తిట్టాడని.. ఆమె కేసు పెట్టింది. ఎందుకంటే నాగార్జున పై ఆమె ప్రచురించిన స్టోరీకి నాగార్జున హర్ట్ అయ్యాడట. అందుకే ఆమెను చంపేస్తానని బ్లాక్ మెయిల్ కూడా చేశాడని ఆమె కంప్లైంట్ లో పేర్కొంది.
2) అల్లు అర్జున్ :
2014 లో అల్లు అర్జున్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు. ఆ టైంలో అల్లు అర్జున్ ను చెక్ చేయడానికి పోలీసులు కారు అద్దం కిందికి దింపాలి అని కోరితే.. అందుకు అతను నిరాకరించాడు. తర్వాత పోలీసులు అతన్ని వదిలేయడం జరిగింది.
3) రాంచరణ్ :
హైదరాబాద్ లోని ఓ సిగ్నల్ వద్ద రాంచరణ్ కారు ఆగితే.. ఇద్దరు కుర్రాళ్ళను తన బౌన్సర్లతో కొట్టించాడు అని ఆరోపణలు వచ్చాయి. అది చాలా పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. తర్వాత రాంచరణ్ వివరణ కూడా ఇచ్చాడు.
4) సాయి పల్లవి :
‘విరాటపర్వం’ సినిమా ప్రమోషన్ల టైం సాయి పల్లవి.. ”ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో హిందూ పండిట్లను అన్యాయంగా చంపడం చూపించారు. అలాగే లాక్ డౌన్ టైంలో ఇక్కడ ‘గో రక్షకుల పేరుతో ఓ ముస్లింని చావగొట్టారు.. అది హింస అయితే ఇదీ హింసే” అంటూ చెప్పుకొచ్చారు. ఇది పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. ఏకంగా భజరంగ్ దళ్ సభ్యులు హైదరాబాద్ కు వచ్చి సాయి పల్లవి పై కేసు పెట్టారు. తర్వాత ఆమె వాళ్లకు క్షమాపణ చెప్పడం జరిగింది.
5) కుష్బూ :
ఈమె పై తమిళనాడులో 2005 లో ఓ కేసు నమోదైంది. ‘ఆడా, మగా పరస్పర అంగీకారంతో పెళ్ళికి ముందు సెక్స్ లో పాల్గొంటే తప్పులేదు. అంత మాత్రాన ఆడవారి శీలం పోయినట్టు కాదు. శీలం అనేది మనసుకు సంబంధించింది’ అంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేసింది. ఇవి పెద్ద వివాదానికి దారితీశాయి. ఈమె పై కొందరు దాడి కూడా చేశారు. ఆ చర్యలను వ్యతిరేకిస్తూ కుష్బూ 40 మంది పై కేసు పెట్టింది. 2018 వరకు ఆమె విచారణకు హాజరైంది.