ఆస్కార్ మన దేశానికి రావాలని కోరుకోని ఉండరు. అలానే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా ఇలానే కోరుకున్నాడు. అయితే గత దశాబ్దాలుగా ఆస్కార్ కోసం మన సినిమాలు వెళ్లడం, అలానే వచ్చేయడం చూస్తూనే ఉన్నాం. ఆయన కూడా అలానే చూస్తూనే ఉన్నాడు. అయితే ఈ ఏడాది ఆస్కార్ బరిలో మన సినిమాలు అందులోనూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా నిలిచాక షారుఖ్ ఖాన్ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. అంతే కాదు తన మనసులోని కోరికను బయటపెట్టాడు. అనుకున్నట్లుగానే రామ్‌చరణ్ ఈ పని చేసి చూపించాడు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు..’ పాటను ఉత్తమ పాటగా పురస్కారం అందుకుంది. రామ్‌చరణ్, తారక్ స్టెప్పులేసిన పాటను కీరవాణి స్వరపరచగా, చంద్రబోస్ స్వరాలందించారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. అయితే ఈ సినిమా, పాట ఆస్కార్ బరిలో నిలుస్తాయని పెద్దగా చర్చలు లేని సమయంలోనే షారుఖ్ ఖాన్ ఓ ట్వీట్ చేశారు. అదే Thank u so much my Mega Power Star Ramcharan. When ur RRR team brings Oscar to India, please let me touch it!!.
అంటే ‘‘మీ ‘ఆర్‌ఆర్ఆర్’ టీమ్ ఆస్కార్‌ని ఇంటికి తెచ్చినప్పుడు ఆ అవార్డును టచ్ చేసే అవకాశం ఇవ్వండి’’ అని అడిగాడు. ఇప్పుడు రాజమౌళి అండ్ కో. ఆ పని చేసి చూపించారు. ‘నాటు నాటు’ ఆస్కార్ అవార్డును అందుకుంది. అయితే ఇప్పుడు మరి అవార్డును టచ్ చేయడానికి షారుఖ్ ఖాన్ హైదరాబాద్ వస్తాడా అనేది చూడాలి. సినిమా టీమ్‌కి ఎంతో బూస్టింగ్ ఇచ్చిన ఆ ట్వీట్‌ని నిజం చేస్తూ రాజమౌళి అవార్డు తెచ్చారు.
దీంతో ఇప్పుడు హైదరాబాద్ వచ్చి అవార్డును టచ్ చేయాల్సిన బాధ్యత షారుఖ్‌దే. ఆయనే కాదు.. మనకూ ఆ అవకాశం వస్తే కచ్చితంగా టచ్ చేస్తాం కదా. కానీ మనకు ఆ అవకాశం రాకపోయినా.. టీమ్‌ను కంగ్రాట్యులేట్ చేసే అవకాశం అయితే వచ్చింది. ఈపాటికి మీరు చేసే ఉంటారులెండి.