చాలాసార్లు కొన్ని సినిమాల ట్రైలర్లు చూసినప్పుడు అసలెందుకు తీసారా అనిపిస్తుంది. కనీస స్థాయి కంటెంట్ క్వాలిటీ ఉండదు, సీన్స్ & డైలాగ్స్ కానీ చాలా రోతగా ఉంటాయి. ఆ సినిమాలు వచ్చి, పోయినట్లుగా కూడా చాలామందికి తెలియదు. ఆ సినిమాల పోస్టర్లు కూడా ఫిలిం నగర్ & సికింద్రాబాద్ ఏరియాలో తప్ప ఎక్కడా కనిపించవు. కానీ.. కొన్ని సినిమాల ట్రైలర్లు ఆశ్చర్యపరుస్తాయి. ఇందులో మంచి కంటెంట్ ఉంది అనిపిస్తుంది. అలా ఇప్పుడు ఆశ్చర్యపరిచిన చిత్రం “రాచరికం” (Racharikam).
Racharikam
వరుణ్ సందేశ్ (Varun Sandesh) నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రంలో విజయ్ శంకర్, అప్సర రాణి (Apsara Rani) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సురేష్ లంకలపల్లి దర్శకుడు. ట్రైలర్లో కంటెంట్ కానీ, డైలాగ్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ ఆసక్తికరంగా ఉన్నాయి. మొన్నటివరకు అప్సర రాణిని అందరు దర్శకులు కేవలం గ్లామర్ డాల్ గా, అనవసరమైన ఎక్స్ పోజింగ్ తో ఎలివేట్ చేస్తే.. మొదటిసారి ఆమెలోని నటిని ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం జరిగింది ఇక్కడ.
అలాగే.. వరుణ్ సందేశ్ క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఉంది. ముఖ్యంగా డైలాగ్స్ లో పొలిటికల్ పంచ్ లు భలే పేలాయి. నిజానికి ఈమధ్యకాలంలో మీడియం బడ్జెట్ సినిమాల కంటే కూడా “రాచరికం” ట్రైలర్ చాలా బెటర్ గా ఉంది. మరి సినిమాగా ఎలా ఉంటుంది అనేది ఫిబ్రవరి 1కి తెలుస్తుంది కానీ.. ప్రస్తుతానికి జనాలని సినిమా వైపుకు తిప్పడంలో మాత్రం విజయం సాధించారు బృందం. అలాగే.. వరుణ్ సందేశ్ కి ఒక నటుడిగా కొత్త ఇమేజ్ ను తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది.