సినిమా వాళ్ళు విడాకుల వ్యవహారాలు ఎప్పుడూ చర్చనీయాంశం అవుతాయి. తాజాగా మరో బాలీవుడ్ కపుల్ (Star Couple ) విడాకుల బాట పట్టడం హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ సీనియర్ హీరో గోవింద (Govinda) తన భార్య సునీత అహుజాకి విడాకులు ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొన్నాళ్ల నుండి వీళ్ళు వేరుగా ఉంటున్నారట. ఇద్దరి మధ్య మనస్పర్థలు దీనికి కారణం అని తెలుస్తుంది. దీంతో వాళ్ళు విడాకులు తీసుకోవడానికి రెడీ అయినట్టు వినికిడి.
37 ఏళ్ళ పాటు కలిసి జీవించిన ఈ జంట… విడాకుల బాట పట్టడం అందరికీ షాకిస్తుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత అహుజా ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది.కొద్దిరోజుల క్రితం… సునీత తన పిల్లలతో కలిసి వేరే ఫ్లాట్ కి షిఫ్ట్ అయినట్టు ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది. ఇక బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం చూసుకుంటే… ఓ 30 ఏళ్ల మరాఠి నటితో గోవింద ఎఫైర్ పెట్టుకున్నాడట.
ఆ విషయం సునీతకి తెలియడంతో.. ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్లు వంటివి పెరిగినట్టు తెలుస్తుంది. అవి పెరగడంతో ఈ సీనియర్ కపుల్.. విడాకుల బాట పట్టినట్టు స్పష్టమవుతుంది. ఇక గోవింద, సునీత 1987 వ సంవత్సరం మార్చి 11న పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వాళ్ళ పేర్లు యశ్వర్ధన్ అహుజా, టీనా అహుజా. సునీతకు 18 ఏళ్ల వయసున్నప్పుడే గోవిందని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఇన్నేళ్లు కలిసున్నా.. వీళ్ళు విడిపోవడానికి మార్గం వెతుక్కోవడం అనేది సరైన పద్ధతి కాదు అని కొందరు భావిస్తున్నారు.