మెగా డాటర్ అనగానే అందరికీ నిహారిక కొణిదెల (Niharika) గుర్తుకొస్తుంది. ఆమె హీరోయిన్ గా, నిర్మాత సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఫైనల్ గా తన ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్ పై ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu) అనే సినిమా తీసి హిట్ అందుకుంది. అయితే ఇప్పుడు మనం మరో మెగా డాటర్ సుస్మిత కొణిదెల (Sushmita Konidela) గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆమె కూడా ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ అనే బ్యానర్ ను స్థాపించి ‘సేనాపతి’ (Senapathi) ‘శ్రీదేవి శోభన్ బాబు’ (Sridevi Shoban Babu) వంటి సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే.
‘సేనాపతి’ ఓటీటీకి వెళ్లడం, దానికి మంచి అప్రిసియేషన్ రావడం జరిగింది. అయితే ‘శ్రీదేవి శోభన్’ బాబు అనే సినిమా రిలీజ్ అయినట్టు కూడా చాలా మందికి తెలీదు. సో కూతుర్ని నిలబెట్టడానికి చిరు ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యారు. వాస్తవానికి కళ్యాణ్ కృష్ణ (Kalyan Krishna) దర్శకత్వంలో ఒక సినిమా పట్టాలెక్కాలి. కానీ అది ఎందుకో డిస్కషన్స్ స్టేజిలోనే ఆగిపోయింది.
‘విశ్వంభర’ (Vishwambhara) కంప్లీట్ అయ్యాక అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఒక సినిమా పట్టాలెక్కనుంది. ‘షైన్ స్క్రీన్స్’ పై సాహు (Sahu Garapati) ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీనికి సుస్మిత కొణిదెల కూడా సహా నిర్మాతగా వ్యవహరించనుంది.అటు తర్వాత బాబీ (Bobby) దర్శకత్వంలో కూడా చిరు (Chiranjeevi) ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించే ఆ సినిమాకి కూడా సుస్మిత సహా నిర్మాతగా వ్యవహరించబోతుంది.
సహా నిర్మాత అంటే ఆమె డబ్బులు పెట్టేది ఏమీ ఉండదు. చిరుని ప్రాజెక్టుకి ఒప్పించి ఆమె బ్యానర్ పేరు వేసుకుంటుంది, లాభాల్లో వాటా తీసుకుంటుంది అంతే..! మరి ఈమె ఫుల్ టైం ప్రొడ్యూసర్ గా ఎప్పుడు పెద్ద సినిమాలు చేస్తుంది? అనే డౌట్ చాలా మందిలో ఉంది. అందు కోసం కూడా ఈమె కథలు వింటుందట. వరుణ్ తేజ్ (Varun Tej) లేదా సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ..లతో ఓ కంప్లీట్ మూవీని ప్రొడ్యూస్ చేసి ఫుల్ టైం ప్రొడ్యూసర్ గా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయట. అది మేటర్.