రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటనకు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది.ఇలా ఈ సినిమా ఎంతోమంది ప్రశంసలు అందుకొని ఎన్నో పురస్కారాలను అందుకొని ఆస్కార్ అవార్డు నామినేషన్ లో నిలిచింది.ఇలా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గాను తప్పనిసరిగా ఆస్కార్ రావాలని ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారు.
ఇతర దేశాలలో కూడా ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ లభించి ఆస్కార్ రావాలని కోరుకుంటూ ఉండగా స్వయంగా మన తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేక విషం కక్కుతున్నారు. ఈ క్రమంలోనే నిర్మాతగా నటుడిగా పేరు సంపాదించుకున్నటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ తరచు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇలా తనకు ఏది తోచితే అది మాట్లాడుతూ పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే తాజాగా RRR సినిమా గురించి రాజమౌళి వ్యవహార శైలి గురించి ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఆస్కార్ అవార్డు కోసం రాజమౌళి ఎంత కృషి చేస్తున్నారో మనకు తెలిసిందే. ఇందుకోసం ఆయన భారీగా డబ్బును కూడా ఖర్చు చేస్తున్నారు. ఈ విషయంపై తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ RRR ఆస్కార్ కోసం 80 కోట్ల వరకు ఖర్చు చేశారని తెలిపారు. ఇలా ఈ సినిమా ఆస్కార్ కోసం చేసిన ఖర్చులతో తాము ఎనిమిది సినిమాలు చేసి ముఖాన కొట్టే వాళ్ళం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
కేవలం వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ కోసమే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మేము సమాజాన్ని మార్చాలని సినిమాలు చేయడం లేదు. మాకు నచ్చిన సినిమాలు చేస్తున్నాం.మేము సమాజాన్ని మార్చాలని చూస్తాం కానీ సమాజాన్ని ఉద్ధరించడానికి మేము పుట్టలేదు కదా అంటూ ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ కావడంతో ఎంతోమంది ఈయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతూ ఉంటే మనవాళ్లే ఇలా మనల్ని కించపరుస్తూ మాట్లాడటం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.