ధర్మవరపు సుబ్రహ్మణ్యం టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ లో ఒకరు. ‘ఒక్కడు’ ‘వర్షం’ సినిమాల్లో ఈయన చేసిన కామెడీ అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు అనడంలో అతిశయోక్తి లేదు. టాలీవుడ్లో ఎంతో మంది స్టార్ కమెడియన్స్ ఉన్నప్పటికీ ఈయనది ప్రత్యేక శైలి. డైలాగులు స్పష్టంగా చెబుతూ.. ఇంకా చెప్పాలంటే స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతూనే కామెడీ పండించేవారు ధర్మవరపు. అందుకే ఆయనకు వరుస సినిమాల్లో అవకాశాలు లభించేవి. ధర్మవరపు సుబ్రహ్మణ్యం రంగస్థల నటుడు. ఈయనతో అద్భుతమైన రచయిత కూడా ఉన్నారు.
పద్యాలు పాడటం అంటే ఈయనకు (Dharmavarapu Subramanyam) చాలా ఇష్టం. అందుకే ఎలాంటి పాత్రనైనా ఈజ్ తో చేసేవారు. అలాంటి ధర్మవరపు 59 ఏళ్ళ వయసులోనే మరణించారు. అందుకు ప్రధాన కారణం ఈయన స్మోకింగ్ ఎక్కువగా చేయడం వల్లనే అని తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆయన తనయుడు రవి బ్రహ్మ చెప్పుకొచ్చారు. అంతేకాదు రెండు సార్లు ధర్మవరపు సుబ్రహ్మణ్యం చచ్చి బ్రతికారని కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు రవి బ్రహ్మ తెలిపాడు.
అతను మాట్లాడుతూ.. “హైదరాబాద్ .. వనస్థలిపురంలో ఒకసారి నాన్నగారికి చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆయన కారును బస్సు ఇవతల వైపు నుంచి ఎక్కేసి అవతల వైపుకు దిగింది. కారు చాలావరకు డ్యామేజ్ అయ్యింది. ఆ టైంలో వెల్డింగ్ పని చేసే వ్యక్తి అటుగా వెళుతూ ఆగారు. కారు పై భాగాన్ని కట్ చేసి నాన్నగారిని పైకి లాగారు. కామినేనిలో నాన్నగారికి చేతికి .. తలకి మేజర్ ఆపరేషన్స్ జరిగాయి. ఆ సమయంలో ఇండస్ట్రీ నుంచి చాలామంది వచ్చి పరామర్శించారు.
ఆ ప్రమాదం నుంచి ఆయన నిదానంగా కోలుకున్నారు. తర్వాత ఆయన ‘శ్వేత నాగు’ సినిమా షూటింగులో పాల్గొన్నారు. బెంగళూరు సమీపంలోని ఒక ఫారెస్టులో షూటింగు జరిగింది. ఆ తరువాత ఆయన తన రూమ్ కి వెళ్లి ఎంతసేపటికి బయటికి రాలేదు. వెళ్లి చూస్తే బెడ్ పై పడిపోయి ఉన్నారు. అసలు స్పృహలో లేరు. దీంతో వెంటనే హాస్పిటల్లో చేర్పించాము. ఫారెస్టులో ఏదో కీటకం కుట్టడం వల్ల అలా జరిగిందని వైద్యులు చెప్పారు.
అంతేకాకుండా ఆయనకు .. స్మోకింగ్ హ్యాబిట్ కూడా ఎక్కువగా ఉంది. అది కూడా ఓ కారణమని తర్వాత తెలిసింది.ఆ టైంలో నాన్నగారు 10 రోజులు కోమాలో ఉన్నారు” అంటూ చెప్పుకొచ్చాడు రవి బ్రహ్మ. ఇక ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. లివర్ క్యాన్సర్ తో చైతన్యపురిలో ఉన్న ‘గీత హాస్పిటల్’ లో మరణించిన సంగతి తెలిసిందే.