రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా, ఏ సినిమా ఎప్పుడు పూర్తి అవుతుందో స్పష్టత లేకపోవడం అభిమానుల్లో కలవరాన్ని కలిగిస్తోంది. రాజా సాబ్ (The Rajasaab), ఫౌజీ, స్పిరిట్(Spirit), సలార్ 2(Salaar) , కల్కి 2(Kalki 2898 AD), ప్రశాంత్ వర్మ (Prasanth Varma) సినిమా.. ఇలా దాదాపు ఏడు సినిమాలు ప్రభాస్ లైన్‌లో ఉన్నాయి. కానీ వీటిలో ఏది మొదట పూర్తి అవుతుంది? ఏది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే విషయాల్లో ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్స్‌పై మిశ్రమ స్పందన వినిపిస్తోంది.
మారుతితో (Maruthi Dasari) చేస్తున్న ‘రాజా సాబ్’ సినిమా ఎప్పటి నుంచో షూటింగ్‌లో ఉన్నా, ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా బయటకు రాలేదు. పక్కా కమర్షియల్ డ్రామాగా ఉండబోయే ఈ సినిమా పూర్తయ్యే దిశగా ప్రభాస్ ముందుకెళ్తున్నాడు. అదే సమయంలో హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే మిలిటరీ డ్రామా కూడా సెట్స్‌పై ఉంది. ఈ రెండు ప్రాజెక్ట్స్‌లో కూడా షూటింగ్ ప్రోగ్రెస్ స్లోగానే సాగుతోందన్న టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే, సందీప్ వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందనున్న పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ సినిమా ఇప్పటికే గతేడాది మొదలయ్యి ఉండాల్సింది. కానీ ఇప్పటికీ సినిమాకు సంబంధించిన ప్రారంభ తేదీ ఖరారు కాలేదు. ఒకవేళ ఇది ఇంకా ఆలస్యం అయితే, వంగా మరో ప్రాజెక్ట్‌కి మకాం మార్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్. వంగా తన స్క్రిప్ట్‌లు ముందుగానే సిద్ధం చేసుకుని, షెడ్యూల్స్‌కు పూర్తి కట్టుబాటుతో పని చేసే డైరెక్టర్‌గా పేరున్నాడు.
అందుకే ప్రభాస్ తరఫున తగిన స్పష్టత లేకపోతే, వేరే స్టార్‌తో సినిమాకు రెడీ అయ్యే ఆలోచనలో ఉన్నాడట. వాస్తవానికి వంగా ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ నుంచి ఏడాది కాలం షెడ్యూల్ అడిగాడని సమాచారం. ప్రభాస్ కూడా అందుకు సిద్ధమయ్యాడని తెలిసినా, ‘రాజా సాబ్’ పూర్తయ్యే వరకు వేరే షూటింగ్‌లకు వెళ్తే అవుతున్న ఆలస్యం వల్ల వంగా వద్దన్నా టైమ్ వృథా కావడం జరుగుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ‘స్పిరిట్’ సినిమా ఆలస్యంగా అయినా వచ్చే ఏడాది తొలి నాళ్లలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇక ఈ ఆలస్యాలన్నింటికీ మధ్య, ప్రభాస్ అన్ని ప్రాజెక్ట్స్‌ను సమర్థంగా పూర్తి చేస్తాడా అనే ప్రశ్న అభిమానుల్లో నిత్యం మారుమోగుతోంది. రెబల్ స్టార్ కెరీర్‌లో ఇది కీలకమైన దశగా మారిన నేపథ్యంలో, ప్రతి సినిమా పైనా అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ‘స్పిరిట్’ ఎప్పటికి మొదలవుతుంది? వంగా ప్రభాస్ కాంబో వర్కౌట్ అవుతుందా? అన్నది చూడాలి.