విజయ్ దేవరకొండ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉప్పెనలా దూసుకువచ్చి స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో చిన్న స్థాయి నటుడి నుండి స్టార్ హీరో స్థాయికి తన టాలెంట్ తో ఎదిగిన విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతడు చేసే డిఫరెంట్ ప్రమోషన్స్ తో యువతను బాగా ఆకట్టుకుంటాడు. ఆ తరువాత 2016లో తన స్నేహితుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారాడు.
కాగా ఆకట్టుకునే కథ, కథనాలతో మంచి ఫ్రెష్ ఫీల్ తో తెరకెక్కిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుని, హీరోగా నటించిన తొలి సినిమాతోనే విజయ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత ఆయన హీరో గా చేసిన ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం ఆ చిత్రం. ఈ సినిమా విజయ్ దేవరకొండ ని ఓవర్ నైట్ స్టార్ హీరోని చేసింది.
ఈ చిత్రం తర్వాత ‘గీత గోవిందం’ తో అయితే ఆయన యూత్ లో చెరగని ముద్ర వేసాడు. ఇండస్ట్రీ లోకి వచ్చిన 5 ఏళ్లకే ఈ రేంజ్ లో సక్సెస్ అయ్యాడంటే మామూలు విషయం కాదు. ఆయన కంటే ముందుగా ఇండస్ట్రీ లోకి వచ్చిన కుర్ర హీరోలు ఎక్కడ మొదలయ్యారో, ఇంకా అక్కడే ఉన్నారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం స్టార్ హీరో రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని మరియు ఫేమ్ ని సంపాదించుకున్నాడు. అందుకే విజయ్ దేవరకొండ అంటే కొంతమంది యంగ్ హీరోలకు పడదు.
ఆయన సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే సంబరాలు కూడా చేసుకున్నారట.ఆ హీరో మరెవరో కాదు, నిఖిల్ సిద్దార్థ. అప్పట్లో విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో పబ్లిక్ గానే ఈ విషయాన్నీ చెప్తూ ట్వీట్ వేసాడు, దానికి నిఖిల్ కూడా కౌంటర్ ఇచ్చాడు. ఆయన సినిమా ఫ్లాప్ అయ్యినప్పుడల్లా నిఖిల్ తన తోటి హీరోలకు పార్టీ ఇచ్చేవాడని, ఎందుకో ఆయనకీ విజయ్ దేవరకొండ అంటే అసలు నచ్చదు అని, ఇలా పలు రకాల వార్తలు ఇండస్ట్రీ లో ప్రచారం అవుతున్నాయి.