స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్ (Game changer) సినిమాను మొదలుపెట్టి రెండేళ్లు అవుతున్నా ఈ సినిమా థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నకు ఎవరి దగ్గరా జవాబు లేదనే సంగతి తెలిసిందే. చరణ్ బుచ్చిబాబు (Buchi Babu Sana), చరణ్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్లలో సినిమాలు ఫిక్స్ కాగా ఈ రెండు సినిమాలు షూటింగ్ ను పూర్తి చేసుకుని రిలీజ్ కావడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే చరణ్ వరుస షూటింగ్స్ తో కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కొత్త కథలను వినడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు వేట్రిమారన్ (Vetrimaaran) చరణ్ కు కథ చెప్పగా వేట్రిమారన్ చెప్పిన స్టోరీ లైన్ చరణ్ కు ఎంతగానో నచ్చిందని సమాచారం అందుతోంది. త్వరలో మరోసారి కలుద్దామని వేట్రిమారన్ కు రామ్ చరణ్ చెప్పినట్టు సమాచారం అందుతోంది. రామ్ చరణ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పట్టే అవకాశాలు అయితే ఉంటాయి. రామ్ చరణ్ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకోనున్నారో చూడాల్సి ఉంది.
నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్న చరణ్ వేగంగా సినిమాల్లో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్ ఒక్కో సినిమాకు 80 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. చరణ్ బాలీవుడ్ లో సైతం పాపులారిటీని పెంచుకోగా కర్ణాటకలో సైతం కోట్ల సంఖ్య ఫ్యాన్స్ చరణ్ ను ఎంతో అభిమానిస్తున్నారు. రామ్ చరణ్ మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలకు అంగీకరిస్తూ కెరీర్ పరంగా ఎదుగుతున్నారు.