టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) వరుస విజయాలతో గ్లోబల్ లెవెల్ లో పేరు సంపాదించుకున్నారు. కల్కి (Kalki 2898 AD) మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయిని ఎన్నో మెట్లు పైకి ఎక్కించిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సినిమాల స్పీడ్ పరంగా, బిజినెస్ పరంగా, సక్సెస్ రేట్ పరంగా ఇండియాలోనే స్టార్ హీరో ప్రభాస్ నంబర్1 అని ఫ్యాన్స్ చెబుతుండటం గమనార్హం. ప్రభాస్ ఇతర హీరోలకు రికార్డ్స్ పరంగా ఎప్పటికప్పుడు గట్టి పోటీ ఇస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
స్టార్ హీరో ప్రభాస్ నంబర్ వన్ హీరో అని ఇందుకు సంబంధించి ఏ మాత్రం సందేహాలు అక్కర్లేదంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ సినిమాలకు జరుగుతున్న స్థాయిలో మరే హీరో సినిమాకు బిజినెస్ జరగడం లేదు. నాన్ థియేట్రికల్ హక్కుల విషయంలో సైతం ప్రభాస్ కు ప్రభాసే సాటి అని కామెంట్లు వినిపిస్తున్నాయి. పండుగ సమయంలో కల్కి విడుదలై ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేది.
వాస్తవానికి జూన్ నెల పెద్ద సినిమాల విడుదలకు అనుకూలం కాదు. అయితే వేర్వేరు కారణాల వల్ల గత నెలలో రిలీజ్ కావాల్సిన కల్కి 2898 ఏడీ సినిమా విడుదల ఈ నెలకు వాయిదా పడింది. కల్కి 2898 ఏడీ సినిమా విడుదలతో పెద్దగా పాపులారిటీ లేని థియేటర్లు సైతం కళకళలాడుతున్నాయి. ఈ మధ్య కాలంలో భారీ అంచనాలతో విడుదలై ఆ అంచనాలను పూర్తిస్థాయిలో అందుకున్న మూవీ మాత్రం కల్కి అనే చెప్పాలి.
కల్కి 2898 ఏడీ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నాగ్ అశ్విన్ (Nag Ashwin) విజన్, థాట్స్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని కామెంట్లు చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్లలో ఎంతోమందికి నాగ్ అశ్విన్ స్పూర్తిగా నిలిచారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. కల్కి1 ఈ రేంజ్ లో ఉంటే కల్కి2 ఏ రేంజ్ లో ఉంటుందో అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.