మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య మూవీలో నటిస్తున్నారు. కొరటాల శివతో ఆయన చేస్తున్న ఈ చిత్రం 40శాతం వరకు షూటింగ్ జరుపుకుంది. లాక్ డౌన్ ముందు వరకు నిరవధికంగా జరిగిన ఈ చిత్ర షూటింగ్ నిలిచిపోయింది.ఈ ఏడాదిలో ఆచార్య విడుదల చేయాలనుకున్న కొరటాల మరియు చిరు ప్లాన్ దెబ్బతింది. కాగా ఈ మూవీ తరువాత చిరంజీవి మలయాళ రీమేక్ నటిస్తున్నారు. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కి భారీ విజయం అందుకున్న లూసిఫర్ తెలుగు రీమేక్ లో చిరంజీవి నటిస్తున్నారు.
లూసిఫర్ రిమేక్ దర్శకుడిగా సాహో ఫేమ్ సుజీత్ ని తీసుకోవడం జరింగింది. ఈ మూవీ స్క్రిప్ట్ కి చిరంజీవి ఇమేజ్ తగ్గట్టుగా మెరుగులు పెట్టే పనిలో సుజీత్ ఉన్నాడు. కాగా ఈ మూవీ నుండి సుజీత్ ని తప్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుజీత్ స్థానములో దర్శకుడు వి వి వినాయక్ ని తీసుకోవాలని చిరంజీవి ఆలోచన చేస్తున్నాడట. గతంలో వి వి వినాయక్ చిరంజీవితో ఠాగూర్, ఖైదీ 150 చిత్రాలు చేసి భారీ విజయాలు అందుకున్నారు. ఇక ఆ రెండు చిత్రాలు కూడా తమిళ చిత్రాలకు రీమక్స్.
దీనితో లూసిఫర్ రీమేక్ బాధ్యతలు కూడా వి వి వినాయక్ కి అప్పగించాలని ఆయన ఆలోచనట. మరి ఇదే నిజమైతే యంగ్ డైరెక్టర్ సుజీత్ కి అన్యాయం జరిగినట్లే. దాదాపు ఆరునెలలగా సుజీత్ ఈ మూవీ స్క్రిప్ట్ పై పనిచేస్తున్నారు. సడన్ గా సుజీత్ ని తప్పిస్తే… ఆయనకు మరో సినిమా ఆఫర్ రావడానికి చాలా సమయం పట్టవచ్చు. ఐతే ఇది కేవలం ఊహాగానం మాత్రమే కాగా, అసలు నిజం ఏమిటో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.