టాలీవుడ్‌లో క్రమంగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ త్రినాధరావు నక్కిన (Trindha Rao) ఇప్పుడు మరో కొత్త ప్రయాణం ప్రారంభించారు. ‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్'(Nenu Local) ‘హలో గురూ ప్రేమ కోసమే'(Hello Guru Prema Kosame) , ‘ధమాకా’ (Dhamaka) వంటి సినిమాలతో కమర్షియల్ సక్సెస్‌లు అందుకున్న ఆయన, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందారు. ఇప్పుడు డైరెక్షన్‌తో పాటు నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. త్రినాధరావు నక్కిన సొంతంగా ‘నక్కిన నరేటివ్’ అనే బ్యానర్ ప్రారంభించి, కొత్త టాలెంట్‌కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
తొలిసారి నిర్మాణంలో ‘చౌర్య పాఠం’ (Chaurya Paatam) అనే సినిమాను తీసుకొస్తున్నారు. సినిమాల్లో సంపాదించిన డబ్బును తిరిగి పరిశ్రమ అభివృద్ధికి వినియోగించాలని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. అలాగే నిర్మాణంలో కూడా ఆయన స్వయంగా క్రియేటివ్ ఇన్వాల్వ్ అవుతుండటంతో సినిమాల స్థాయి మెరుగవుతుందని భావిస్తున్నారు. దర్శకుడిగా ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్ ప్రకటించకపోయిన త్రినాధరావు, ఇకపై తాను అగ్ర నిర్మాణ సంస్థలతో కలిసి పనిచేయబోతున్నట్లు స్పష్టమైంది.
మైత్రీ మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ వంటి బ్యానర్లతో కమిట్‌మెంట్లు ఉన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు చిన్న నిర్మాణ సంస్థలతో పని చేసిన త్రినాధరావు, ఇప్పుడు పెద్ద బ్యానర్లలో అడుగు పెట్టడం వల్ల బడ్జెట్ పరంగా కూడా భారీ స్థాయికి ఎదగనున్నట్లు తెలుస్తోంది. త్రినాధరావు నక్కిన ప్రత్యేకత సింపుల్ కథలను పక్కా కమర్షియల్ ట్రీట్‌మెంట్‌లో చూపించడం.
ఆయన తీసిన సినిమాల్లో బిగ్ బడ్జెట్ లు పెట్టకుండానే భారీ విజయాలు సాధించిన ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు మైత్రీ, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లాంటి బ్యానర్ల నుంచి వస్తున్న సినిమాలపై కూడా అదే నమ్మకం నెలకొంది. ఇక ఈ కొత్త సినిమాల్లో హీరోలు ఎవరు అన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు రవితేజ (Ravi Teja), నాని (Nani) వంటి మిడ్ రేంజ్ స్టార్స్‌తో మాత్రమే పనిచేసిన త్రినాధరావు, ఈసారి బిగ్ స్టార్స్ లెవెల్‌లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.