మ్యాన్లీ హీరో జగపతి బాబు (Jagapathi Babu) ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నప్పటికీ… ఒకప్పుడు ఆయన కూడా స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. కెరీర్ ప్రారంభంలో మాస్ ఫాలోయింగ్ కోసం యాక్షన్ సినిమాలు చేసినా.. అతనికి బ్రేక్ ఇచ్చింది మాత్రం ప్రేమ కథలు, కుటుంబ కథా చిత్రాలు. సాధారణంగా ప్రేమకథలు, కుటుంబకథా చిత్రాలు అంటే టన్నుల కొద్దీ ఎమోషన్ , సీరియల్ టైపు టేకింగ్ ఉంటుంది అనే విమర్శలు అప్పటి నుండి ఉన్నాయి. కానీ జగపతి బాబు ఎంపిక చేసుకునే కథలు కొంచెం డిఫరెంట్ గా ఉండేవి. అవి అతనికి మరింత ప్లస్ అయ్యాయి అనే చెప్పాలి. జగపతి బాబు నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్లో ‘శుభాకాంక్షలు’ (Subhakankshalu) సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది.1997 ఫిబ్రవరి 14న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 28 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ‘శుభాకాంక్షలు’ (Subhakankshalu) గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం రండి :
1) 1996 ఫిబ్రవరి 15న తమిళంలో విజయ్ (Vijay Thalapathy) హీరోగా రిలీజ్ అయిన ‘పూవె ఉనక్కాగ’ అనే సినిమాకు రీమేక్ గా ఈ ‘శుభాకాంక్షలు’ (Subhakankshalu) రూపొందింది. తెలుగులో వెంకటేష్ కి (Venkatesh) ‘వసంతం’ (Vasantam) వంటి సూపర్ హిట్ అందించిన విక్రమన్ తొలినాళ్లలో డైరెక్ట్ చేసిన సినిమా ఇది.
2) తమిళంలో ఇది మంచి హిట్ అయ్యింది. దీంతో నిర్మాత ఆర్.బి.చౌదరి (R. B. Choudary) తెలుగులో ఎన్వీ ప్రసాద్, ఎస్.నాగ అశోక్ కుమార్ తో కలిసి ఆ సినిమాని రీమేక్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు. ముందుగా కొందరు హీరోలను అనుకున్నారు కానీ.. అప్పటికి జగపతి బాబు డేట్స్ ఉండటం వల్ల అతన్ని హీరోగా ఫిక్స్ అయ్యారు.
3) తెలుగులో ఈ కథని డెవలప్ చేయాలని చాలా మంది రైటర్స్ కి డైరెక్టర్స్ కి చెప్పడం జరిగింది. అయితే అప్పటికి జగపతి బాబుతోనే ‘శుభమస్తు’ అనే సినిమా తీసిన భీమనేని శ్రీనివాసరావుని (Bhimaneni Srinivasa Rao) దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. స్క్రీన్ ప్లేని కూడా ఆయనే డిజైన్ చేసుకున్నారు. అయితే మరిదూరి రాజా డైలాగ్స్ రాయడం జరిగింది.
4) స్క్రిప్ట్ ప్రాపర్ గా రెడీ అవ్వడంతో 42 రోజులకే షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేశారు.
5) సీనియర్ స్టార్ హీరోయిన్ రాశికి (Raasi) ఇది డెబ్యూ మూవీ. ఇందులో నందిని అనే పాత్రని పోషించింది ఆమె. తమిళంలో ఆ పాత్రని అంజు అరవింద్ అనే నటి చేసింది.
6) ఇక నిర్మలా మేరీ అలియాస్ ప్రియదర్శిని పాత్రని రవళి (Ravali) చేశారు. తమిళంలో ఈ పాత్రని సంగీత మాధవన్ నాయర్ చేశారు.తెలుగులో ఈమె బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘సమరసింహారెడ్డి’ (Samarasimha Reddy) సినిమాలో నటించింది. మహేష్ బాబు (Mahesh Babu) ‘నాని’ (Naani) సినిమాలో కూడా నటించింది.
7) తమిళంలో ఈ సినిమాని రూ.6 కోట్ల బడ్జెట్లో తీశారు. అక్కడ బాక్సాఫీస్ వద్ద రూ.9 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అయితే తెలుగులో ఈ సినిమాని రూ.5 కోట్ల కంటే తక్కువ బడ్జెట్లోనే తీశారు. ఇక్కడ కూడా ఈ సినిమా రూ.10 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది.
8) ఒక విధంగా ‘శుభాకాంక్షలు’ (Subhakankshalu) సినిమా తమిళంలో కంటే తెలుగులోనే సూపర్ హిట్ అయ్యింది అని చెప్పాలి.
9) ఈ సినిమా హైలెట్స్ గురించి చెప్పాలి అంటే ముందుగా సుధాకర్ (Sudhakar) కామెడీ గురించి చెప్పాలి. ఒక రకంగా సెకండ్ హీరో టైపు రోల్ ఇది. ఈ పాత్రకి రాసిన డైలాగులు నాన్ స్టాప్ గా ప్రేక్షకులను నవ్విస్తాయి అనడంలో సందేహం లేదు.
10) ఈ సినిమాకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు. వాళ్ళే కోటి, అలాగే మాతృకకి పనిచేసిన ఎస్.ఎ.రాజ్ కుమార్. ఈ సినిమాలో ‘గుండె నిండా గుడి గంటలు’ ‘ఆనందమానందమాయే’ ‘అద్దంకి చీరకట్టె ముద్దుగుమ్మ’ ‘మనసా పలకవే’ వంటి పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి.
11) ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఏవీఎస్ కామెడీ కానీ సెకండాఫ్లో వచ్చే బ్రహ్మానందం (Brahmanandam) కామెడీ కానీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.
12) ఒక పాటలో అయితే సూపర్ స్టార్ కృష్ణ (Krishna) కూడా కనిపించి డాన్స్ చేయడం జరిగింది. దీంతో ఈ సినిమాకి ఆయన అభిమానులు కూడా సపోర్ట్ చేశారు.
13) ఈ సినిమా క్లైమాక్స్ కూడా ఎమోషనల్ గా ఉంటుంది.
14) ‘బేబీ’ (Baby) ‘ప్రేమిస్తే’ ‘7/జి బృందావన కాలనీ’ వంటి సినిమాలే కల్ట్ సినిమాలు అనుకుంటే ‘శుభాకాంక్షలు’ వాటి కంటే చాలా బెటర్ గా ఉంటుంది. కావాలంటే యూట్యూబ్లో అందుబాటులో ఉంది. టైం ఉంటే చూడండి