ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ విడుదలకు రెడీ అవుతుంది.బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. బాలీవుడ్లో ప్రభాస్ నటించిన స్ట్రైట్ మూవీ ఇది. జూన్ 16న విడుదల కాబోతుంది. ప్రమోషన్స్ డోస్ కూడా ఇప్పుడిప్పుడే పెంచుతున్నారు. బిజినెస్ లెక్కలు కూడా తేలిపోయాయి. ‘ఆదిపురుష్’ తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రభాస్ కి ఇచ్చేసింది టి.సిరీస్ సంస్థ. పారితోషికంతో పాటు తెలుగు రాష్ట్రాల బిజినెస్ హక్కుల్లో ప్రభాస్ కి పార్ట్నర్ షిప్ ఉండటంతో నిర్మాతలు అలా చేశారు.
ఇక ప్రభాస్… ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థకు హక్కులను ఇచ్చేయడం జరిగింది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వారు తీసుకున్న ‘ఆదిపురుష్’ హక్కులకు రూ.160 కోట్ల వరకు పారితోషికం చెల్లించినట్టు తెలుస్తుంది. ఈ మొత్తంలో ‘యూవీ క్రియేషన్స్’ సంస్థకి ప్రభాస్ రూ.100 కోట్ల వరకు చెల్లించినట్టు భోగట్టా. ఎందుకంటే అది అతని హోమ్ బ్యానర్ లాంటిది కాబట్టి..! దీంతో ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ.. చాలా రోజులుగా తీర్చాల్సిన అప్పులను తీర్చేసినట్టు తెలుస్తుంది.
దిల్ రాజుకి కూడా యూవీ సంస్థ రూ.40 కోట్లు చెల్లించాలి. ఆ అమౌంట్ ని ఇప్పుడు సెటిల్ చేసేసారట. అలాగే ఇంకా కొన్ని అప్పులు ఉన్నాయి. వాటిని కూడా తీర్చేసింది యూవీ క్రియేషన్స్ సంస్థ. అంతేకాకుండా.. తెలుగు రాష్ట్రాల్లో ‘ఆదిపురుష్’ ను కొన్ని ఏరియాల్లో రిలీజ్ చేయబోతున్నారు అని వినికిడి. సినిమాకి (Adipurush) మంచి టాక్ వస్తే కనుక లాభాలు కూడా గట్టిగానే వస్తాయి. సో ఓవరాల్ గా యూవీ సంస్థకి పెద్ద రిలీఫ్ అనమాట.