నష్టాల్లో ‘యూవీ’.. ఆ 2 ప్రాజెక్టుల్ని వదిలేసుకుంటుందట!
- November 28, 2024 / 09:27 PM ISTByFilmy Focus
యూవీ క్రియేషన్స్ (UV Creations) సంస్థ ప్రభాస్ కి (Prabhas) హోమ్ బ్యానర్ వంటిది. దీని అధినేతలు అయిన వంశీ, ప్రమోద్ (Pramod Uppalapati), విక్రమ్ (V. Vamshi Krishna Reddy)..లు ప్రభాస్ కి బెస్ట్ ఫ్రెండ్స్. ‘మిర్చి’ (Mirchi) సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత ‘రన్ రాజా రన్’ (Run Raja Run) ‘జిల్’ (Jil) ‘ఎక్స్ ప్రెస్ రాజా’ (Express Raja) ‘మహానుభావుడు’ (Mahanubhavudu) ‘భలే భలే మగాడివోయ్’ (Bhale Bhale Magadivoy) ‘టాక్సీ వాలా’ (Taxiwaala) వంటి సినిమాలు చేశారు. అన్నీ బాగానే ఆడాయి. ఆ తర్వాత ప్రభాస్ తో ‘సాహో’ (Saaho) అనే భారీ బడ్జెట్ సినిమా చేశారు.
UV Creations

అది కూడా కమర్షియల్ గా వర్కౌట్ అయ్యింది. కానీ ఆ వెంటనే ప్రభాస్ తో చేసిన ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిపోయింది.’మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush) ‘గామి’ (Gaami) వంటి సినిమాలు ఓకే అనిపించినా వాటికి పెద్దగా లాభాలు ఏమీ రాలేదు.ఇప్పుడు చిరంజీవితో (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara) అనే భారీ బడ్జెట్ సినిమాని నిర్మిస్తున్నారు. అలాగే అనుష్కతో (Anushka Shetty) ‘ఘాటి’ (Ghaati) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘విశ్వంభర’ కి భారీగా రూ.150 కోట్లు బడ్జెట్ పెట్టేశారు. వి.ఎఫ్.ఎక్స్ ఔట్పుట్ సరిగ్గా రాలేదని మళ్ళీ ఇంకాస్త బడ్జెట్ పెట్టి వర్క్ చేయిస్తున్నారు.

అనుష్క సినిమాకి కూడా రూ.50 కోట్లు బడ్జెట్ పెట్టాల్సి వస్తుందట. దీంతో వాళ్ళు ఈ టైంలో ఇంకో సినిమాని నిర్మించే పరిస్థితుల్లో లేరు. ప్రస్తుతం ఈ సంస్థ వరుణ్ తేజ్ (Varun Tej) – మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) ..ల ప్రాజెక్టుకి, అలాగే గోపీచంద్ (Gopichand) – రాధాకృష్ణ కుమార్ (Radha Krishna Kumar) ప్రాజెక్టుకి కమిట్ అయ్యారు. అయితే ఇప్పుడు నష్టాల్లో ఉండటం వల్ల.. వాటిని ‘యాత్ర’ నిర్మాతలు అయిన ’70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్’ వారికి అప్పగించినట్టు సమాచారం. వీళ్ళు కూడా ప్రభాస్ కి ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే.
















